ఫిక్స్ అయిన ధమాకా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్..

     Written by : smtv Desk | Thu, Jan 12, 2023, 12:24 PM

ఫిక్స్ అయిన ధమాకా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్..

మాస్ మహారాజా రవితేజకు వరుస ఫ్లాఫ్ ల తరువాత హ్యాట్రిక్ హిట్ అందించిన చిత్రం ధమాక. ‘ధమాకా’ చిత్రంతో రవితేజ మరో హిట్ ఖాతాలో వేసుకున్నాడు. పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ఆడియన్స్ ని ఆకట్టుకుంది. రవితేజ, యువ హీరోయిన్ శ్రీలీల నటన అందరికీ నచ్చింది. యాక్షన్ ఎపిసోడ్స్ తో పాటు హుషారైన సాంగ్స్ కి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. దాంతో, తొలి రోజు నుంచే మంచి కలెక్షన్లు రాబట్టింది. డిసెంబర్ 23న రిలీజైన ఈ సినిమా రెండు వారాల్లోనే రూ.100 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. ప్రోడ్యుసర్స్, డిస్ట్రిబ్యూటర్స్‌కు భారీ లాభాలను తెచ్చిపెట్టింది. ధమాకాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించాయి.
త్రినాథరావు నక్కిన దర్శకత్వ భాద్యతలు చేపట్టగా, బెజవాడ ప్రసన్నకుమార్ రచయితగా వ్యవహరించారు. భీమ్స్ సిసిరోలియో అదిరిపోయే సంగీతం అందించగా, కార్తిక్ ఘట్టమనేని సినిమాటోగ్రాఫర్‌గా పని చేశారు. థియేటర్లలో కలెక్షన్ల వర్షం కరిపించిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి రాబోతోంది. ‘ధమాకా’ ఓటీటీ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. భారీ మొత్తంతో హక్కులు దక్కించుకున్న నెట్ ఫ్లిక్స్ జనవరి 22 నుంచి చిత్రాన్ని స్ట్రీమింగ్ చేయనుంది.





Untitled Document
Advertisements