గులాబీ నీటితో ఇలా చేయడం వలన మీ స్కిన్ ఇరిటేషన్ తగ్గుతుంది..

     Written by : smtv Desk | Thu, Jan 12, 2023, 04:05 PM

గులాబీ నీటితో ఇలా చేయడం వలన మీ స్కిన్ ఇరిటేషన్ తగ్గుతుంది..

గులాబీల సోయగం నచ్చినివారు ఎవరు? ఎంత అందంగా ఎన్నో రంగుల్లో, సహజ సిద్దమైన పరిమళంతో కనువిందు చేసే ఆ గులాబీలతో ఎన్ని ఉపయోగాలో, ఆ గులాబీలను కొన్ని పద్ధతుల ద్వారా నీటిలో మరిగించి గులాబీ నీరు ఉత్పత్తి చేస్తారు. మరి ఈ గులాబీ నీరు వల్ల మనకు చాలా ఉపయోగాలే ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.

-గులాబీ నీరు మీ చర్మాన్ని హైడ్రేట్ చేయడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. దీనిని టోనర్లోనో, మిస్టలోనూ, మరెన్నో కాస్మెటిక్స్ లోనూ ఉపయోగిస్తారు. ఇది మీ చర్మంపై ఉండే రంద్రాలను తగ్గించి మీ మొహం అందంగా
కనిపించేలా చేస్తుంది. గులాబీ నీరు ఉండే యాంటీ బాక్టీరియల్ ఎఫెక్ట్ వల్ల మీ చర్మం మీద ఉండే యాక్నె తొలగించి మీ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడుతుంది.

- గులాబీ నీరు సంగ్రహాల కారణంగా మీ చర్మంపై ఉండే రెడ్ నెస్ ఇంకా ఇరిటేషన్ తగ్గు ముఖం పడతాయి.

* రోజ్ వాటర్ ను తరచూ ఉపయోగించడం వల్ల చర్మంలో అదనపు నూనె లేకుండా చేస్తుంది మరియు బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ మరియు మొటిమాటు వంటి సమస్యలను నివారిస్తుంది. చర్మాన్ని పొడిబార్బే చేసే రసాయన ఆధారిత టోనర్ ల కంటే ఈ రోజ్ వాటర్ ని టోనర్ లా ఉపయోగించడం మంచిది.

ఈ గులాబీ నీరు మీ చర్మం యొక్క pH శాతాలను బ్యాలిన్స్ చేయడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. దీని pH
మీ చర్మ pH శాతానికి దగ్గరగా ఉండడం వల్ల ఇది మీ చర్మ pH శాతాలని బ్యాలెన్స్ చేయడంలో చక్కగా సరిపోతుంది.

గులాబీ నీటిని ఉపయోగించవచ్చు. ఒక టీస్పూన్ ముల్తానీ మట్టిలో రెండు లేదా మూడు టీస్పూన్ల ఆర్గానిక్ రోజ్ వాటర్ వేసి ఎలాంటి గడ్డలు లేకుండా బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని ముఖంపై అప్లై చేసి, సున్నితంగా వృత్తాకార కదలికలతో మీ ముఖాన్ని మసాజ్ చేస్తూ సమానంగా విస్తరించండి.. ప్యాక్ ని రెండు నిమిషాల వరకు లేదా ముల్తానీ మట్టి ఎండిపోయినట్లు మీకు అనిపించే వరకు ఉంచండి.. వెచ్చని మరియు తడిగా ఉన్న క్లాత్ తో మొహాన్ని తుడవండి. అటు పై మీ ముఖాన్ని గోరువెచ్చని నీటితో మెల్లగా కడిగేస్తే సరి.

- గులాబీ నీరు మంచి టోనర్ గా పనిచేస్తుంది. అది మీ చర్మంపై ఉపయోగించడం వల్ల మొహం పై ఉబ్బు తగ్గుతుంది. అలాగే ఎండ వల్ల కలిగిన మంటను తగ్గిస్తుంది. ఇందుకోసం చల్లని గులాబీ నీటిలో దూదిని ముంచి ఆ నీటిని ముఖల పై పెట్టాలి. లేదా మీరు కావాలనుకుంటే రోజ్ వాటర్ బాటిల్ ని ముఖానికి 5 నుండి 6 అంగుళాల దూరంలో ఉంచి స్ప్రే చేయవచ్చు. అవి గాలికి ఆరనిచ్చి మొహానికి మాయిశ్చరైజర్ రాయండి. ఇలా చేయడం వల్ల స్కిన్ ఇరిటేషన్

ఇంకెందుకు ఆలస్యం గులాబీ నీటిని ఉపయోగించి అందంగా ఉండే గులాబీ వన్నెను మీ సొంతం చేసుకోండి.





Untitled Document
Advertisements