ట్రెండీ షరార ప్రతిసారి కొత్తగా వేసుకొండిలా

     Written by : smtv Desk | Fri, Jan 13, 2023, 02:39 PM

ట్రెండీ షరార ప్రతిసారి కొత్తగా వేసుకొండిలా

నేటి తరం మహిళలు తాము వేసుకునే దుస్తుల్లో ఎన్నో రంగులు, రకాలు, స్టైల్స్ అంటూ ఎంచుతూ పోతున్నారు. వాళ్ళ అవసరాలకి అనుగుణంగానే ఫ్యాషన్ డిజైనర్ లు కూడా దుస్తులను డిజైన్ చేస్తున్నారు. అందులో ఒకటే ఈ షరారా. షరారా అంటే నడుము నుండి పాదాల వరుకు కూడా లూజ్ గా చూడడానికి ఏ లైన్ లాగా కనిపిస్తూ ఉంటుంది. దీన్ని చాలా వరుకు షార్ట్ కుర్తీస్ లేదా కుర్తాస్ పై వేసుకుంటున్నారు. కొందరు దీనికి దుప్పట్టాను కూడా జోడిస్తారు. అయితే ఈ షరారాలను ప్రతి సారీ కొత్తగా ఎలా వేసుకోవచ్చు అనేది చూద్దాము.

*టియర్డ్ షరారా:- ఈ టియార్డ్ శారారా అంటే షరారా ఫ్లెయిర్ ఒక్కొక లెవెల్ లాగా ఉంటుంది ఒక్కోసారి షరారా. ఇందులో రెండు రకాలు ఉంటాయి ఒకటి ప్లెయిన్ షరారా మీద అడ్డ గీతలు ఉండి లెవెల్స్ ఉన్నట్టుగా కనిపిస్తాయి. రెండు మూడు లేదా నాలుగు లెవెల్స్ క్లాత్ ని అతికించి కుట్టి ఆ అతికిన బాగం దగ్గర లేస్ తో కుడతారు. ఈ రెండు కూడా చూడడానికి వేసుకోవడానికి చాలా బాగుంటాయి. ఈ రకం షరారా ఫ్లెయిర్ ఎక్కువగా ఉండడం వల్ల ఇది సన్నగా ఉండేవారికి మంచి ఎంపిక అవుతుంది.
* షరారా ప్యాంట్:- షరారా డ్రెస్ మీరు మొత్తంగా వేసుకోకపోయినా షరారా ప్యాంట్ పై షార్ట్ కుర్తీ లేదా షార్ట్ టాప్ ఆర్ క్రాప్ టాప్ లాంటిది వేసుకుని దాని పై ఏదైనా మ్యాచింగ్ లాంగ్ జాకెట్ వేసుకోవచ్చు. ఇలా వేసుకోవడం వల్ల ఇండో వెస్టర్న్ లుక్ వస్తుంది.
* లాంగ్ కుర్తా షరారా:- అదేంటి షరారా అంటే షార్ట్ కుర్తీతో వేసుకుంటారు కదా అనుకోకండి సాధారణంగా కొలతలు ఎక్కువగా ఉన్న లేదా పొట్టిగా ఉండే అమ్మాయిలు షరారా వేసుకున్నప్పుడు షార్ట్ టాప్ కారణంగా అది వారికంతా బాగా నప్పదని ఈ రకం డ్రెస్ ను వేసుకోవడం పూర్తిగా మానేస్తూ ఉంటారు. అయితే ఆ భావన ఉన్నవారు కాస్తా ఆ ఆలోచన పక్కన పెట్టి షార్ట్ కుర్తీ బదులు లాంగ్ కుర్తా వేస్కున్నట్లైతే మీకు చాలా చక్కగా నప్పుతుంది. మీరు కావాలంటే లాంగ్ కుర్తాస్ బదులు హై-లో కుర్తాస్ కూడా వేసుకోవచ్చు. హై-లో కూర్తాస్ అంటే ముందు భాగం పొట్టిగా అంటే పైకి ఉండి వెనుక భాగం టాప్ కిందకి ఉంటుంది.
* ఆల్ ఓవర్ షరారా:- ఈ రకంలో షరారా అనేది మొత్తం టాప్ అండ్ బాటమ్ ఒక రకం క్లాత్ తోనే తయారు అవుతుంది. అయితే దీని పైన టాప్ ఫ్లెయిర్ గా ఉన్న షార్ట్ కుర్తీ వేసుకుంటే బాగుంటుంది. వీటినే పెప్లం టాప్స్ అని కూడా అంటారు. ఇవి ఫ్లెయిర్ ఉండి చూడడానికి చాలా బాగుంటాయి. ఇవి పొట్టిగా ఉండే అమ్మాయిలకు కూడా చాలా బాగా నప్పుతాయి. సాధారణంగా షరారాలో టాప్ కొంచం పొట్టిగా మోకాలి వరుకే ఉండడం వల్ల పొట్టిగా ఉండే అమ్మాయిలకు అంతగా నప్పదు అయితే ఇందులో డ్రెస్ అంతా ఒకే ప్రింట్ ఉండడం వల్ల మీ బాడీ 50-50 లాగా కనిపించదు అందువల్ల పొట్టిగా ఉన్నవారు కూడా దీన్ని ఎలాంటి అలోచన లేకుండా వేసుకోవచ్చు.

చూశారుగా ఈ రకం దుస్తులు మనకు నప్పవు అనుకునే కంటే వాటిని మనకి అనుగుణంగా ఎలా అన్వయించుకోవచ్చో ఆలోచిస్తే ఏ బట్ట అయినా మనకి దాసోహం అనాల్సిందే ఏం అంటారు లేడీస్ ??





Untitled Document
Advertisements