మంటల్లో నుండి చూస్తే అవతలి వస్తువులు కదులుతున్నట్టు ఉంటాయి?

     Written by : smtv Desk | Fri, Jan 13, 2023, 03:46 PM

మంటల్లో నుండి చూస్తే అవతలి వస్తువులు కదులుతున్నట్టు ఉంటాయి?

సాధారణంగా ఎపుడైనా మంటలు వచ్చినప్పుడు ఆర్పే లోగా అవి గాలి తగిలి ఇంకా పెరుగుతాయి.. ఆ సమయంలో ఆ మంటల నుంచి చూసినప్పుడు అవతలి వైపు ఉన్న వస్తువులు, కానీ ఇంకేమైనా కాని కదులుతున్నట్లు కనిపిస్తుంది.. అయితే అలా ఎందుకు కనిపిస్తుంది ఎవరికైనా తెలుసా? ఇప్పుడు మంటల్లో నుండి చూసినప్పుడు అవతలి వైపు కదులుతున్నట్టుగా అనిపించడానికి గల కారణాలు మనం తెలుసుకుందాం..
వేడి వల్ల గాలీ వ్యాకోచిస్తుంది. కనుక ఉష్నోగ్రతలోని చిక్కదనం తగ్గి తేలికవుతుంది. దానివల్ల మంట పైకి లేస్తుంది. అంతకు ముందు ఆ ప్రదేశంలో ఉన్న చల్ల గాలిని తోసుకుంటూ వేడి గాలి పైకి వెళుతుంది. అంటే మంట మీద నుంచి చుస్తున్నప్పుడు కదలిపోతున్న వాయు స్థభంలో నుంచి చూస్తున్నామన్నమాట. ఈ గాలి కదలికలు కూడా అంతటా ఒకే విధంగా ఉండవు. గాలి చిక్కదనం వివిధ ప్రదేశాలలో వేరు వేరుగా ఉంటుంది. అందువలననే ఉష్ణవాయు స్థంభం వెనుక ఉన్న వస్తువులు కదిలిపోతున్నట్లు మన కంటికి కనిపిస్తాయి.





Untitled Document
Advertisements