బగబగ మండే మంటలను ఫైర్ సర్వీస్ వాళ్ళు ఎలా అర్పుతారు

     Written by : smtv Desk | Tue, Jan 17, 2023, 11:32 AM

బగబగ మండే మంటలను ఫైర్ సర్వీస్ వాళ్ళు ఎలా అర్పుతారు

మాములుగా ఎక్కడైన మంటలు అంటుకున్నప్పుడు నీరు పోస్తే అవి చల్లరిపోతాయి.. కానీ కొన్ని సందర్భాలలో అలా జరగదు ప్రమాదవశాత్తు ఏర్పడి, లేదా ఏదైనా ఇంధనం వలన ఏర్పడిన మంటలు నిమిషాల్లోనే అన్ని చోట్లల్లో వ్యాపిస్తాయి.. అటువంటి సందర్భాలలో వాటిని ఆర్పేందుకు మనం ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా అవి చల్లారకపోగా అంతకంతకు వేగంగా వ్యాపిస్తునే ఉంటాయి. మనం ఎంత ప్రయత్నించినా అదుపులోకి రాణి మంటలను కేవలం ఫైర్ సర్వీస్ వారు మాత్రమే ఆర్పగలరు.. అయితే నీరు పోసిన ఆగని మంటలు ఫైర్ సర్వీస్ వారు ఎలా ఆర్పగలరు.. అనే సందేహం ప్రతిఒక్కరిలో ఉంటుంది.. అయితే, మంట స్వభావాన్ని బట్టి వాటిని ఆర్పేందుకు రకరకాల పదార్దాలు వాడతారు. అన్నింటినీ నీటితోనే ఆర్పరు.. మంటకు ఆక్సిజన్ అందకుండా చేయడం. కాలుతున్న వస్తువు వేడి తగ్గించడం, మండేందుకు అవసరమైన ఇంధనం దొరకకుండా చేయడం ముఖ్యమైన నివారణలు. పూరిల్లు, గడ్డివాములు లాంటివి తగులబడినప్పుడు నీటిని వేగంగా చల్లి అర్పుతారు. నీరే కాకుండా కార్బన్ డై ఆక్సైడ్ సిలిండర్స్ , ఫోమ్ డ్రై కెమికల్ పౌడర్ లాంటి వాటిని వాడతారు. మంటలు తీవ్రంగా ఉన్నప్పుడు, మంటకు ఆక్సిజన్ అందకుండా చేసేందుకు కార్బన్ డై ఆక్సైడ్ సిలిండర్స్ ను వాడతారు.నూనే మంటల్ని నీటితో ఆర్పరు.. వాటిపై నీరు చల్లితే బరువువల్ల నీరు అడుగుకు చేరి నూనే పైకి తేలి మంట ఆరదు. వీటిని ఆర్పేందుకు నూనేపైన పరుచుకుని ఆక్సిజన్ అందకుండా చేసే ఫోమ్ ను వినియోగించి మంటలను అర్పుతారు.





Untitled Document
Advertisements