మనం నిద్రించడానికి గల కారణాలు ఏంటి?

     Written by : smtv Desk | Tue, Jan 17, 2023, 11:37 AM

మనం నిద్రించడానికి గల కారణాలు ఏంటి?

కడుపు నిండా ఆహారం కమ్మటి నిద్ర ఈ రెండింటి కోసమే ప్రతి మనిషి ఎంతగానో తాపత్రయపడతాడు. ఎన్ని కోట్ల రూపాయలు సంపాదించినా కడుపు నిండా కంటికి నచ్చిన ఆహరం తిని కంటినిండా నిద్రపోలేని జన్మ వ్యర్థం. కారణం
ఈ భూమి మీద జీవించే ప్రతి ప్రాణికి నీరు, ఆహారం గాలి ఎలా అవసరమో అలానే నిద్ర కూడా చాల ముఖ్యం.. ఇక మనుషుల విషయానికి వస్తే ఒక్క రోజు నిద్ర పోకపోయిన వారు చాల నీరసంగా మారిపోతారు.. అయితే రోజంతా పనిచేసిన చేయకపోయినా ఖచితంగా నిద్ర వస్తుంది అయితే అసలు ఎందుకు నిద్ర వస్తుంది అని ఎవరికైనా తెలుసా.. మనం మెలకువగా ఉన్నప్పుడు మరియు నిద్ర సమయంలో మెదడు తన పని తాను చేసుకొనే పోతుంది. నిద్రను మెదడులోని కొన్ని భాగాలూ నియంత్రిస్తూ ఉంటాయని శాస్త్ర పరిశోధనలా ద్వారా తేలింది. మన శరీరం రోజంతా ఏదో ఒక పనిచేసిన కారణంగా శక్తి నిల్వలు తగ్గిపోతాయి. ఈ శక్తి నిల్వలు తగ్గినందువలన మనకు నిద్ర వస్తుంది. మనము నిద్రించే సమయంలోనే మన మెదడు శక్తిని పుడ్చుకునే ప్రయత్నం చేస్తుంది. మన మానసిక శక్తి కూడా నిద్రలోనే సమకూరుతుంది.





Untitled Document
Advertisements