ఉల్లిని తరిగితే కన్నీరెందుకు వస్తుంది?

     Written by : smtv Desk | Tue, Jan 17, 2023, 12:25 PM

ఉల్లిని తరిగితే కన్నీరెందుకు వస్తుంది?

ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు అనే సామెత వినే ఉంటారు. అంటే ఉల్లిలో అన్ని ఆరోగ్యప్రయోజనాలు ఉన్నాయని అర్ధం. ఉల్లి తినడం వలన మన ఒంటికి చలువ చేస్తుంది. జీర్ణక్రియ మెరుగ్గా ఉంటుంది. సుఖవిరోచనం అవుతుంది అనే విషయం దాదాపు ప్రతి ఒక్కరికి తెలుసు. ముఖ్యంగా మనం ఏదైనా కూర చేయాలంటే ముఖ్యంగా కావాల్సింది ఉల్లిపాయ.. ఉల్లిపాయ లేనిదే ఏ వంట చేయలేము. కానీ ఉల్లిపాయలు కోయడానికి మాత్రం ఇష్టపడరు ఎందుకంటే ఉల్లిపాయలు తరిగే సమయంలో కళ్ళు మండుతాయి.. అలాగే కళ్ళలో నుంచి నీరు కరుతాయి. అయితే అలా ఎందుకు కళ్ళు మండుతాయి అనే విషయం మాత్రం చాల మందికి తెలియదు.. దానికి కారణం ఉల్లిపాయలలో మన కళ్ళను మండించే ఒక పదార్ధం ఉంది. దాని పేరు ప్రోఫిన్ సల్ఫిసిన్. ఉల్లిపాయను కోయగానే దానిలో ఉన్న పదార్థాలు గాలిలో కలిసి మన కంటికి తగులుతుంది. కళ్ళను మండిస్తుంది. వెంటనే మన కళ్ళ నుండి నీరుకారుతుంది. ఇలా కళ్ళలో నుంచి నీరు కారడం మంచిదే. ఎందుకంటే గాలిలో ఉండే ధూళికణాలు మన కంటిలోకి చేరుతాయి. మన కళ్ళలో చేరిన ధూళి కణాలు ఆ నీటితో పాటు బయటకు వస్తాయి.





Untitled Document
Advertisements