మనం పిల్చే గాలిలో వందశాతం ఆక్సిజన్ ఉంటుందా?

     Written by : smtv Desk | Tue, Jan 17, 2023, 12:32 PM

మనం పిల్చే గాలిలో వందశాతం ఆక్సిజన్ ఉంటుందా?

గాలి, నీరు, ఆహారం ఈ భూమ్మీద జీవించే జీవ కోటికి ప్రాణాధారం అనే విషయం మనకు తెలుసు. అయితే ఆహారం లేకపోయినా కొన్ని రోజులు జీవిస్తారేమో కానీ గాలి, నీరు లేకుండా మనిషి బ్రతకడం అసాధ్యం.. అదే గాలి లేకుండా ఒక గంట కూడా ఉండలేరు.. అయితే గాలిలో కార్బన్ డై ఆక్సైడ్ మరియు ఆక్సిజన్ రెండు ఉన్నాయి. కానీ ఈ రెండిట్లో మనిషి జీవించడానికి కావాల్సింది ఆక్సిజన్.. అంటే మనిషి తనలో ఉండే కార్బన్ డై ఆక్సైడ్ బయటకి వదిలి ఆక్సిజన్ ను పీల్చుకుంటాడు.. కానీ మనం పీల్చేది కేవలం ఆక్సిజనేనా అనే సందేహం ఉంటుంది.. నిజానికి మనం పిలుస్తున్నదంతా ఆక్సిజన్ కానే కాదు.. మనం పీలుస్తున్న గాలిలో కేవలం ఆక్సిజన్ 20 శాతం మాత్రమే ఉంటుంది. మిగిలిన 80 శాతంలో 60 శాతం నైట్రోజన్ 20 శాతం కార్బన్ డై ఆక్సైడ్ లాంటి ఇతర వాయువులు కూడా కలిసి ఉంటాయి. వాస్తవానికి గాలిలో పూర్తిగా ఆక్సిజన్ ఉండదు. ఆ విధంగా ఉంటె మొత్తం జీవకోటికి ప్రమాదకరంగా పరిణమిస్తుంది.





Untitled Document
Advertisements