ఆ రోజుల్లో ఎయిర్ హోస్టెస్ డ్రెస్ వేసుకున్నప్పుడు కలిగిన ఆనందం వేరు.. కాంచన

     Written by : smtv Desk | Wed, Jan 18, 2023, 11:24 AM

ఆ రోజుల్లో  ఎయిర్ హోస్టెస్  డ్రెస్ వేసుకున్నప్పుడు కలిగిన  ఆనందం వేరు.. కాంచన

నిన్నటి తరం నాయికలలో కాంచన ఒకరు. ఈమె తెలుగు తెరపై 60 .. 70వ దశకాలలో హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన అందాల తార. ఈమె ఆ రోజుల్లో ఎయిర్ హోస్టెస్ గా జాబ్ చేస్తూనే .. ఆ వైపు నుంచి సినిమా ప్రయత్నాలు చేశారు. అలనాటి స్టార్ హీరోలందరితోను ఈమె కలిసి నటించారు. సంప్రదాయానికి కేరాఫ్ అడ్రస్ గా కనిపించే హీరోయిన్స్ ఉన్న ఆ రోజుల్లోనే వారి మధ్యన మోడ్రన్ లుక్ తో అప్పట్లోనే జోరైన .. హుషారైన పాత్రలను చేయడంలో తనదైన ప్రత్యేకతను చాటుకున్నారు.
అలాంటి కాంచన తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .. " నేను తమిళనాడులో పుట్టి పెరిగాను. చిన్నప్పటి నుంచి చాలా యాక్టివ్ గా ఉండేదానిని. ఏదైనా సరే ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవడానికి ముందు ఉండేదానిని. మా నాన్న అప్పుల్లో ఉన్నారనే విషయం అర్థం కావడానికి నాకు కొంత సమయం పట్టింది. ఎయిర్ హోస్టెస్ గా జాబ్ చేశాను. అప్పట్లో నెలకి 600 జీతం ఇచ్చేవారు. అదే చాలా ఎక్కువగా అనిపించేది. ఆ డ్రెస్ వేసుకున్నప్పుడు కలిగే ఆనందం వేరు" అన్నారు.
సినిమాల్లో మోడ్రన్ కేరక్టర్స్ ఎక్కువగా చేసినా, బయట చాలా సంప్రదాయ బద్ధంగా ఉండేదానిని. దాంతో నన్ను పెళ్లి చేసుకోవడానికి చాలా పెద్ద పెద్ద వారు ముందుకు వచ్చారు. కానీ మా అమ్మ పిన్నికొడుకు ఒకడు ఉండేవాడు .. వాడు ఎందుకూ పనికిరాడు. అమ్మానాన్నలు అతను చెప్పినట్టు ఆడేవారు. నా ఆస్తులు నాకు కాకుండా పోవడానికి అతనే కారకుడు. కోర్టు ద్వారా పోరాడటానికి జీవితమంతా సరిపోయింది" అంటూ చెప్పుకొచ్చారు.





Untitled Document
Advertisements