ఎవరితో మాకేంటి పని అంటూ స్కూటీపై రొమాన్స్ చేస్తూ రచ్చ చేసిన జంట.. వారి కొరకు పోలీసుల వేట

     Written by : smtv Desk | Wed, Jan 18, 2023, 11:45 AM

ఎవరితో మాకేంటి పని అంటూ స్కూటీపై రొమాన్స్ చేస్తూ రచ్చ చేసిన జంట.. వారి కొరకు పోలీసుల వేట

ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే దేశం ఎటుపోతుంది అనేది అర్ధం కాని పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా యువత.. దేశ భావిష్యత్తుకు వారదులుగా చెప్పుకునే యువత మాత్రం భాద్యతాయుతంగా ప్రవర్తిస్తుంది.
కొంతమంది సరైన దారిలో వేలుతున్నప్పటికి కొంతమంది మాత్రం ఎవరేమనుకుంటే నాకేంటి? ఇలా భావించే కొందరు సమాజ కట్టుబాట్లు, పద్ధతులను పట్టించుకోరు. ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో ఓ యువ జంట బహిరంగంగా శృంగార చేష్టలకు దిగింది. అది కూడా నడి రోడ్డుపైనే. ప్రియుడు స్కూటర్ నడుపుతుంటే, అతడి కౌగిలించుకుని ఒళ్లో కర్చున్న ప్రియురాలు ముద్దులు పెడుతోంది. వెనుక వస్తున్న వాహనదారులలో ఒకరు ఈ తతంగాన్ని వీడియో తీశారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాలపైకి చేరి పెద్ద సంచలనంగా మారింది. దీంతో లక్నో పోలీసులు ఈ జంటను పట్టుకునేందుకు చర్యలు మొదలు పెట్టారు.
లక్నోలోని హజరత్ గంజ్ ప్రాంతంలో ఈ వీడియో తీసినట్టు పోలీసులు గుర్తించారు. డిప్యూటీ పోలీస్ కమిషనర్ అపర్ణ రజత్ కౌశిక్ ఈ వీడియో నిజమైనదేనని నిర్ధారించారు. జంటను పట్టుకునేందుకు రెండు పోలీసు బృందాలను రంగంలోకి దింపారు. సీసీటీవీ కెమెరాల సాయంతో వారిని గుర్తించే పనిలో ఉన్నారు. మోటారు వాహనాల చట్టం, అసభ్యతను వ్యాపింపజేస్తున్నందుకు వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు ప్రకటించారు.
https://twitter.com/shubhankrmishra/status/1615387306445398017?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1615387306445398017%7Ctwgr%5E334955c0a2f422d5ebfde58c560945caa5c9a75b%7Ctwcon%5Es1_c10ref_url=https%3A%2F%2Fwww.ap7am.com%2Fflash-news-762530%2Flucknow-police-searching-for-couple-after-video-of-them-romancing-on-scooty-goes-vira





Untitled Document
Advertisements