నేడు ఈశాన్య రాష్ట్రాలలో ప్రకటించనున్న ఎన్నికల షెడ్యుల్

     Written by : smtv Desk | Wed, Jan 18, 2023, 11:51 AM

నేడు ఈశాన్య రాష్ట్రాలలో ప్రకటించనున్న ఎన్నికల షెడ్యుల్

నేటి మధ్యాహ్నం ఈశాన్య రాష్ట్రాలు నాగాలాండ్, మేఘాలయ, త్రిపుర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం బుధవారం ప్రకటించనుంది. ఎన్నికల సంఘం మధ్యాహ్నం 2.30 గంటలకు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలోనే ఎన్నికల షెడ్యుల్ విడుదలకు సన్నాహాలు చేస్తుంది. త్రిపురలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధికారంలో ఉంది. మేఘాలయ, నాగాలాండ్‌లో సంకీర్ణ ప్రభుత్వాల్లో బీజేపీ భాగంగా ఉంది. నాగాలాండ్, మేఘాలయ, త్రిపుర అసెంబ్లీల ఐదు సంవత్సరాల పదవీకాలం వరుసగా మార్చి 12, మార్చి 15, మార్చి 22 న ముగియనుంది.
ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) రాజీవ్ కుమార్ నేతృత్వంలోని బృందం మూడు ఈశాన్య రాష్ట్రాల్లో పర్యటించింది. గత వారం వరుస సమావేశాలు నిర్వహించింది. మూడు రాష్ట్రాల్లోని రాజకీయ పార్టీలు, పౌర అధికారులు, కేంద్ర భద్రతా అధికారులతో ఈ సమావేశాలు జరిగాయి. 2.30 గంటలకు జరగబోయే విలేకరుల సమావేశం కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.





Untitled Document
Advertisements