నా సంపాదన కోసమే నా జీవితంలో పెళ్ళనేది లేకుండా చేసారు.. అలనాటి అందాలతార కాంచన

     Written by : smtv Desk | Wed, Jan 18, 2023, 05:22 PM

నా సంపాదన కోసమే నా జీవితంలో పెళ్ళనేది లేకుండా చేసారు.. అలనాటి అందాలతార కాంచన

అలనాటి అందాల తార కాంచన తెలుగుతెర పై ఓ వెలుగు వెలిగారు . అప్పట్లో కుర్రకారు గుండెల్లో గూబులు రేకెత్తించిన కాంచన వయసు ప్రస్తుతం 80 ఏళ్లకు పైనే. అప్పటి అందాల తార మాత్రం పెల్లికాకుండానే ఒంటరిగా మిగిలిపోయారు. ప్రస్తుతం ఆమె అయిన వారి ఆశ్రమంలో ఉంటూ తన శేష జీవితాన్ని గడుపుతున్నారు. ఆమె భగవంతుడి నామస్మరణతో ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. తనకి ఎలాంటి ఆర్థికపరమైన ఇబ్బందులు లేకుండా ఆ భగవంతుడే చూసుకుంటున్నాడంటూ ఆమె అపారమైన విశ్వాసాన్ని చాటుతున్నారు.

తాజా ఇంటర్వ్యూలో కాంచన మాట్లాడుతూ .. "ఎవరికోసమైతే ఇంటికి కొడుకుగా మారిపోయి కష్టపడి సంపాదించానో, ఆ తల్లిదండ్రులే నన్ను ఆదుకోలేదు .. ఆదరించలేదు అని అంతా అనుకుంటున్నారు .. అది నిజమే. నా ఆస్తుల కోసం నాకు పెళ్లికాకుండా చేశారనేది కూడా నిజమే. నా జీవితంలో హార్ట్ ఎటాక్ వచ్చి పోవలసిన కష్టాలు ఎన్నో వచ్చాయి .. అయినా తట్టుకుని నిలబడ్డాను" అని అన్నారు.
"మా మాటను మించి వేరే వారి మాటలను నమ్మే పరిస్థితుల్లో అప్పట్లో అమ్మానాన్నలు ఉన్నారు. ఆ సమయంలో నిలదీయకపోవడం.. నేను చెప్పింది వినవలసిందే అనే ఒక ధోరణి చూపించకుండా సహనంతో సర్దుకుపోవడం నేను చేసిన తప్పు. మారతారేమోనని ఎదురుచూడటం పొరపాటైంది. ఎవరు చేసిన కర్మను వారు అనుభవించక తప్పదు. భగవంతుడు తన పాదాలు పట్టుకుంటే అంతా తానే చూసుకుంటానని అంటాడు. ఇప్పుడు నేను చేస్తున్నది అదే" అంటూ చెప్పుకొచ్చారు.





Untitled Document
Advertisements