మెంతులతో ఇలా చేస్తే ఎటువంటి చుండ్రైనా మటుమాయం

     Written by : smtv Desk | Wed, Jan 18, 2023, 05:28 PM

మెంతులతో ఇలా చేస్తే ఎటువంటి చుండ్రైనా మటుమాయం

జుట్టు ఊడకుండా జాగ్రత్త పడడం ఒక సమస్య అయితే జుట్టు తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా జుట్టుకు సంబంధించిన సమస్యలు పరిష్కరించుకోవడం అంతకంటే పెద్ద సమస్య అనే చెప్పాలి. చుండ్రు అందులో ఒకటి. ప్రతి పదిలో అయిదు మంది ఈ చుండ్రు సమస్యతో బాధ పడుతున్నారని నిపుణులు చెప్తున్నారు. అసలు ఈ చుండ్రు ఏంటి? అది ఎలాంటిది ? దానికి గల కారణాలు ? పరిష్కారాలు ఎంటో చూద్దాం

చుండ్రు అనేది సెబోరోహెయిక్ డెర్మటైటిస్ (SD)కి సంబంధించినది, ఇది చర్మంపై దురద మరియు పొరలుగా మారడానికి కారణమవుతుంది, అయితే ఇది తలపై మాత్రమే వస్తుంది. ఇది చాలా సాధారణమైన సమస్య అయినప్పటికీ ఎక్కువ శాతం మంది దీనితో బాధపడుతూ ఉంటారు.
చాలా మంది ఈ చుండ్రును పోగొట్టుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కొందరికి చుండ్రుతో పాటు దురద కూడా పుడుతూ ఉంటుంది.

లక్షణాలు:-
చుండ్రు యొక్క ప్రధాన లక్షణాలు రేకులు మరియు దురద, పొలుసులు. తెలుపు, జిడ్డుగల రేకులు సాధారణంగా మీ జుట్టులో మరియు మీ భుజాలపై పేరుకుపోతాయి మరియు శీతాకాల నెలలలో గాలి పొడిగా ఉన్నప్పుడు తరుచుగా అధ్వాన్నంగా ఉంటాయి.

చుండ్రు యొక్క అదనపు లక్షణాలు:-
- ఎరిథెమా, ఇది తల చర్మంపై మరియు కొన్నిసార్లు ముఖంపై ఎరుపు రంగు పాచెస్
- కనుబొమ్మల చుండ్రు
- జుట్టు ఊడుట
- ముఖం యొక్క చర్మంపై పొడి రేకులు
- మొఖం పై మొటిమలు

చుండ్రు యొక్క కారణాలు:-
- పొడిబారిన చర్మం - మీకు పొడి చర్మం ఉన్నట్లైతే మీకు చుండ్రు సమస్య ఎక్కువగా ఉండే అవకాశం ఉంది
- మీరు మీ జుట్టుని సరిగ్గా రుద్దుకొనట్లైతే కూడా మిమ్మల్ని చుండ్రు సమస్య బాధించే అవకాశం ఉంది
- మీ జుట్టులో ఫంగస్ పెరుగుదల ఎక్కువ ఉన్నా కూడా మీకు చుండ్రు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి

చుండ్రు అరికట్టేందుకు చిట్కాలు:-
- చుండ్రు తగ్గించేందుకు టీ ట్రీ ఆయిల్ చాలా బాగా పనికొస్తుంది. టీ ట్రీ ఆయిల్ లోని మైక్రో బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉండడం వల్ల ఇది చుండ్రును నివారించేందుకు సహాయపడుతుంది. ఇందుకోసం మీరు వాడే కొబ్బరి నూనెలో కొంత శాతం టీ ట్రీ ఆయిల్ కలిపి మీ జుట్టుకు పట్టించడం వల్ల చుండ్రు తగ్గుముఖం పడుతుంది.
- మెంతులు చుండ్రు నివారణకు ఒక గొప్ప ఔషదమని చెప్పవచ్చు. ముందుగా మెంతులను రాత్రంతా నానబెట్టి మరుసటి రోజు వాటిని మెత్తగా రుబ్బి జుట్టుకు పట్టించండి. ఇలా చేయడం వల్ల మీ మెంతుల్లో ఉండే చేదు మీ జుట్టులోని చుండ్రును తరిమి కొడుతుంది
- మెంతుల నూనె కూడా చుండ్రు సమస్యను అధిగమించేందుకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇందుకోసం ఒక కప్పు కొబ్బరి నూనెలో పావు కప్పు మెంతులు వేసి కొంచం గోరు వెచ్చగా అయ్యేంత వరకు మరిగించండి. చల్లారిన తరువాత వడకట్టి జుట్టుకి రాయండి. కొద్దీ రోజుల్లోనే మీకు తేడా తెలుస్తుంది.
- వేప నూనె కూడా చుండ్రును చక్కగా అరికడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

మరి మీ చుండ్రు సమస్యను పోగొట్టుకోవడానికి పైన చెప్పిన వాటిని ఉపయోగించి మంచి ఫలితాలను పొందండి.





Untitled Document
Advertisements