బీహార్ ముఖ్యమంత్రి కాన్వాయ్ కొరకు రైళ్ళను సైతం నిలిపేశారు..

     Written by : smtv Desk | Thu, Jan 19, 2023, 11:45 AM

 బీహార్ ముఖ్యమంత్రి కాన్వాయ్ కొరకు రైళ్ళను సైతం నిలిపేశారు..

మాములుగా దేశంలో ఎక్కడైనా సరే భద్రత దృష్ట్యా అత్యంత ప్రముఖులు ఎవరైనా రోడ్డుమీద వెళుతున్నారు అంటే రహదారులను బ్లాక్ చేసి వారికి దారి ఇవ్వడం అనేది మనకు తెలిసిందే. ముఖ్యం ప్రధానమంత్రి. ముఖ్యమంత్రి వస్తున్నారంటే రహదారులపై వాహనాలను నిలిపివేయడం చూశాం. కానీ, ఓ ముఖ్యమంత్రి కాన్వాయ్ కోసం రైళ్లను ఆపివేయడం అరుదుగానే ఉంటుంది. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కాన్వాయ్ వెళ్లేందుకు వీలుగా ఇలానే చేశారు.
బీహార్ లోని బక్సర్ జిల్లాలో నితీష్ కుమార్ సమాధాన్ యాత్ర చేపట్టారు. ఇందులో భాగంగా రైలు పట్టాల మీదుగా రహదారి మార్గంలో ముఖ్యమంత్రి కాన్వాయ్ వెళ్లాల్సి ఉంది. ఇందుకోసం ఏకంగా 15 నిమిషాల పాటు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. బక్సర్ స్టేషన్ అవుటర్ సిగ్నల్ వద్ద రెండు రైళ్లు నిలిచిపోయాయి. సీఎం వెళ్లిన తర్వాత వాటికి గ్రీన్ సిగ్నల్ పడింది. విసుగెత్తిన ప్రయాణికులు కొందరు రైలు దిగి నడుచుకుంటూ, వేరే వాహనాలను ఎక్కి తమ గమ్యస్థానాలకు వెళ్లిపోయారు. కేంద్ర సహాయ మంత్రి అశ్విని చౌబే దీనిపై విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ చేపట్టింది సమాధాన్ యాత్ర కాదని, విఘాత యాత్ర అని విమర్శించారు.





Untitled Document
Advertisements