కోకిల తన గుడ్లను తాను పొదుగుతుందా?

     Written by : smtv Desk | Thu, Jan 19, 2023, 12:11 PM

కోకిల తన గుడ్లను తాను పొదుగుతుందా?

మాములుగా ఎవరి స్వరమైనా వినసొంపుగా ఉంది అంటే వారి స్వరాన్ని కోకిల స్వరంతో పొలవడం మనకు తెలిసిన విషయమే. అదేవిధంగా పక్షులలో మంచి స్వరం ఉన్న పక్షి ఎది అంటే ముందుగా గుర్తొచ్చేది కోకిల దీని స్వరం అన్ని పక్షులకంటే అతి మధురంగా ఉంటుంది.. వీటి స్వరం వినడానికి ఎంతో ఇష్టపడతారు.. ఇక సాధారణంగా అన్ని పక్షులు అవి పెట్టిన గుడ్లను అవే పోదుగుతాయి కానీ కోకిలలు మాత్రం అలా చేయవు దానికి కారణం ఎంతనేది ఇప్పుడు తెలుసుకుందాం.. కవులు సాహిత్య౦లో కోకిలకు విశిష్ట స్థానం ఇచ్చారు. కంఠం మధురంగా ఉందని చెప్పడానికి కోకిల స్వరంతో పోల్చారు. శీతాకాలంలో వలస వచ్చే కోకిల అరుపు వసంత ఋతువు వచ్చి౦దనటానికి నిదర్శనం. మనకు సుపరిచితమైన ఆ పక్షి జాతులు 127 రకాలున్నాయి. తూర్పు ప్రాంతంలో ఉండే ఈ జాతి పిల్లలను స్వయంగా పోదగలేవు, ఇవి పిల్లల్ని పొదగడానికి ఇతర పక్షుల మీద ఆధారపడతాయి. ఇవి గుడ్లను వేరే పక్షి గూటిలో పెడతాయి.సాధారణంగా జాతి కోయిలలు గుడ్లను పొదిగే విధానం వింతగా ఉంటుంది. వీటి అరుపు కూడా తేడాగా ఉంటుంది. ఇవి ఒక గుడ్డును వేరే జాతి పక్షి గూటిలో పెట్టినప్పుడు, ఆ పక్షి గూటిలోని ఒక గుడ్డు బయట పడేస్తుంది. లేదా తినేస్తుంది. గుడ్డు పెట్టిన తర్వాత అది పొదగబడి పిల్ల అయ్యేవరకు గమనిస్తూ ఉంటుంది.





Untitled Document
Advertisements