వర్షం కురినప్పుడు ఆకాశంలో ఇంద్ర ధనుస్సు కనిపించుటకు కారణమేంటి?

     Written by : smtv Desk | Thu, Jan 19, 2023, 12:16 PM

వర్షం కురినప్పుడు ఆకాశంలో ఇంద్ర ధనుస్సు కనిపించుటకు కారణమేంటి?

వర్షం కురుస్తు ఎండ కాసిన సమయంలో ఇంద్ర ధనుస్సు ఏర్పడుతుంది అని అందరూ అంటారు. ఇంద్ర ధనుస్సు ఏర్పడిన సమయంలో వాతవరణం చాలా అందంగా ఉంటుంది.. దీనిలో ఏడూ రంగులు ఉంటాయి.. అని తెలుసు కాని ఇంద్రధనుస్సు ఎందుకు కనిపిస్తుంది అని ఎవరికైనా తెలుసా..
ఏడూ రంగుల ఇంద్ర ధనుస్సు అంటే తెల్లటి కాంతిలో మిళితమై ఉన్న ఏడూ రంగులు ప్రత్యేక్షం కావడం. తెల్లటి కాంతి ఏడూ రంగులుగా విడిపోవడానికి పట్టకం లాంటి వస్తువులు కావాలి లేదా తెల్లటి కాంతి విడిపోయే పరిస్థితి ఏర్పడాలి. వర్షం పడ్డప్పుడు వాతవరణంలో నీటి ఆవిరి శాతం పెరగడం, నీటి బిందువులు ఉండటం జరుగుతుంది. నీటి బిందువులు గుండా సూర్యుని కాంతి ప్రసరించినపుడు అవి పట్టకంలా పనిచేస్తాయి. అందువలన తెల్లటి కాంతి ఏడూ రంగులుగా విడిపోతుంది. ఇంద్ర ధనుస్సు ఎప్పుడు ఏర్పడిన సూర్యుడికి ఎదురుగానే ఏర్పడుతుంది.





Untitled Document
Advertisements