మనుషులనే కాదు కోతులను కూడా కట్టిపడేస్తున్న స్మార్ట్ ఫోన్ !

     Written by : smtv Desk | Fri, Jan 20, 2023, 11:32 AM

మనుషులనే కాదు కోతులను కూడా కట్టిపడేస్తున్న స్మార్ట్ ఫోన్ !

ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు దాదాపు చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు గంటల తరబడి స్మార్ట్ ఫోన్ ని అతుక్కుని ఉండడం మనకు తెలిసిన విషయమే. అయితే స్మార్ట్ ఫోన్ మనుషులని మాత్రమె కాకుండా కోతులను సైతం తన వలలో వేసుకుంది.! అదేంటి కోతులు స్మార్ట్ ఫోన్ వలలో పడడమేంటి అనుకుంటున్నారా? అవునండి ఇది నిజం! కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు షేర్ చేసిన వీడియో చూస్తే ఇది తెలుస్తుంది.

ఓ వ్యక్తి స్మార్ట్ ఫోన్ ను చేత్తో పట్టుకుని కోతులకు చూపిస్తుంటే.. అవి చేతులతో స్క్రోల్ చేస్తూ ఆసక్తిగా చూస్తున్నాయి. వీటికి తల్లికోతి తోడైంది. అది కూడా ఫోన్ దగ్గరగా వచ్చి చూస్తోంది. ‘‘డిజిటల్ అక్షరాస్యత అవగాహన ఎంత విజయం సాధించిందో చూడండి. ఊహించని స్థాయికి చేరింది’’ అని కిరణ్ రిజుజు ఈ వీడియోని పోస్ట్ చేసి ట్వీట్ పెట్టారు. ఈ వీడియోను ఇప్పటి వరకు 1.21 లక్షల మంది చూశారు. దీనికి ఓ వ్యక్తి బీజేపీ ఐటీ సెల్ పని చేస్తున్న మాదిరే ఈ వీడియో కూడా ఉందని కామెంట్ చేశాడు. అయితే, ఈ పనితో ఓ పెద్ద ప్రమాదం ఉంది. స్మార్ట్ ఫోన్ అభిరుచి కోతులకు అలవడిందంటే అప్పుడు మనుషుల చేతుల్లోని ఫోన్లు.. చెట్లపై కోతుల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం లేకపోలేదు.
https://twitter.com/KirenRijiju/status/1615983207845081089?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1615983207845081089%7Ctwgr%5Ee13b3ed3ca28ac480af0f5edbf804d02760704ce%7Ctwcon%5Es1_c10ref_url=https%3A%2F%2Fwww.ap7am.com%2Fflash-news-762660%2Funion-minister-kiren-rijiju-posts-clip-of-monkeys-scrolling-through-a-smartphone





Untitled Document
Advertisements