ఏపీ క్యాడర్ కు చెందిన తెలంగాణ డీజీపీని కూడా అక్కడికే పంపాలి: బీజేపీ ఎమ్మెల్యే

     Written by : smtv Desk | Fri, Jan 20, 2023, 05:07 PM

ఏపీ క్యాడర్ కు చెందిన తెలంగాణ డీజీపీని కూడా అక్కడికే  పంపాలి: బీజేపీ ఎమ్మెల్యే

ఏపీ క్యాడర్ కు చెందిన సోమేశ్ కుమార్ తెలంగాణ సీఎస్ గా పనిచేసిన విషయం తెలిసిందే. అయితే, తెలంగాణ సీఎస్ గా పని చేసిన సోమేశ్ కుమార్ ను కొన్నిరోజుల కిందట ఏపీ క్యాడర్ కు పంపడం తెలిసిందే. అయితే, ఇదే తరహాలో మరి కొంతమంది ఉన్నతాధికారులు తమ సొంత క్యాడర్ లో కాకుండా, తెలంగాణలో కొనసాగుతున్నారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపిస్తున్నారు.
అటువంటి వారలి తెలంగాణ డీజీపీ కూడా ఉన్నారని, సోమేశ్ కుమార్ తరహాలో ఆయనను కూడా వెంటనే ఏపీ క్యాడర్ కు బదిలీ చేయాలని కోరారు. తెలంగాణలో ఉన్న ఏపీ క్యాడర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై పీఎంవోకు ఫిర్యాదు చేసినట్టు ఆయన వెల్లడించారు.

ఉన్నత సర్వీసుల అధికారులు ఎక్కడ పోస్టింగులు లభిస్తే అక్కడికి వెళ్లి పనిచేయాల్సి ఉంటుందని, సుప్రీం కోర్టు కూడా ఇదే విషయం చెబుతోందని అన్నారు. కానీ, కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ (క్యాట్) నిర్ణయంతో 15 మందిని సొంత క్యాడర్ కు పంపకుండా అడ్డుకున్నారని, ఇది సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధమని రఘునందన్ రావు పేర్కొన్నారు.
సొంత క్యాడర్ లో కాకుండా, తెలంగాణలో కొనసాగుతున్న అధికారులను వారి సొంత క్యాడర్ కు పంపించాలని స్పష్టం చేశారు. హైదరాబాదులోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన సందర్భంలో రఘునందన్ రావు ఈ వాఖ్యలు చేసారు.





Untitled Document
Advertisements