ఈ బ్రష్ లు ఉపయోగిస్తే పర్ఫెక్ట్ మేకప్ మీ సొంతం..

     Written by : smtv Desk | Mon, Jan 23, 2023, 04:23 PM

ఈ బ్రష్ లు ఉపయోగిస్తే పర్ఫెక్ట్ మేకప్ మీ సొంతం..

మేకప్ నేడు కాలేజ్ కి వెళ్ళే అమ్మాయిల దగ్గర నుండి ఆఫీస్ కి వెళ్ళే ఉద్యోగినుల వరుకు ప్రతి ఒక్కరికీ ప్రీతిపాత్రంగా మారిపోయింది. అయితే ఇంకా చాలా మందికి మేకప్ గురించి తెలియని విషయాలు చాలానే ఉన్నాయనడంలో ఎలాంటి అనుమానం లేదు. అలాంటి వారి కోసం అలానే రోజు మేకప్ సాధనాలను ఉపయోగించేవారి కోసం మేకప్ బ్రషేస్ గురించి ఈ కొంత సమాచారం

మేకప్ బ్రష్ అనేది సింథటిక్ జుట్టుతో ( అసహజమైన జుట్టు ) తయారు చేయబడుతుంది. ఇది మేకప్ ఉత్పత్తులను మొహంలోకి చొచ్చుకుపోయేలా చేసేందుకు, అలాగే మొహం మెరుగ్గా కనిపించేలా చేసేందుకు సహాయపడుతుంది. ఈ మేకప్ బ్రష్ లలో చాలా రకాలే ఉన్నాయి. ఇవి అవసరం బట్టి వాడుతూ ఉంటారు. అందులో కొన్ని ఈరోజు చూద్దాం

• ఫ్లాట్ ఫౌండేషన్ బ్రష్:- ఈ ఫ్లాట్ ఫౌండేషన్ బ్రష్ అనేది చూడడానికి చదునుగా ఉండి మొహానికి ఫౌండేషన్ లేదా క్రీంను సమాంతరంగా అప్లై చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ బ్రష్ ఎక్కువ శాతం ఉత్పత్తిని మొహానికి అప్లై చేయడానికి ఉపయోగిస్తారు మేకప్ నిపుణులు. సాధారణంగా ఈ రకం బ్రష్ తో బ్లెండింగ్ అనేది అస్సలు కుదరదు ఇది కేవలం అప్లై చేయడానికి మాత్రమే బాగుంటుంది.

• స్టిప్లింగ్ బ్రష్:- ఈ రకం బ్రష్ లో సహజమైన మరియు అసహజమైన జుట్టు రెండు ఉంటాయి. ఈ బ్రష్ ఉపయోగించడం వల్ల మేకప్ అనేది మొహంలోకి బాగా బ్లెండ్ అవుతుంది. అలాగే చూసేందుకు ఎయిర్ బ్రష్ మేకప్ ఫినిష్ వస్తుంది. ఈ బ్రష్ ఉపయోగించేటప్పుడు చాలా లైట్ ఇంకా సర్కులర్ మోషన్స్ తో మేకప్ అప్లై చేసినట్లైతే చాలా మంచి లుక్ ఇస్తుంది.

• ఫ్లాట్ కన్సీలర్ బ్రష్:- ఫ్లాట్ కన్సీలర్ బ్రష్ అచ్చంగా ఫ్లాట్ ఫౌండేషన్ బ్రష్ లాగానే సింథటిక్ హెయిర్ తో చేయబడి ఉంటుంది. ఇది ఎక్కువ శాతం ఉత్పత్తిని మొహానికి రాయడానికి ఉపయోగపడుతుంది. సాధారణంగా కన్సీలర్ అనేది మొహంలో కొంచం నల్లగా ఉండే భాగాలు అంటే కళ్ళ కింద పెడువుల చుట్టూతా ఇలా తక్కువ హైలైట్ అయిన భాగాల మీద ఉపయోగిస్తూ ఉంటారు. ఈ ఫ్లాట్ కన్సీలర్ ఇలాంటి ప్రదేశాల్లో మేకప్ అప్లై చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది.

• రౌండ్ కన్సీలర్ బ్రష్:- ఈ రౌండ్ కన్సీలర్ బ్రష్ అనేది అచ్చు ఫ్లాట్ కన్సీలర్ బ్రష్ లానే పని చేస్తుంది కాకపోతే ఇది తక్కువ మొత్తంలో కన్సీలర్ అప్లై చేయడానికి ఉపయోగిస్తారు. ఇది మొహానికి ఒక ఈవెన్ లుక్ ఇవ్వడంలో సహాయపడుతుంది.

• పౌడర్ బ్రష్:- ఈ పౌడర్ బ్రష్ కు ఉన్న హెయిర్ రౌండ్ గా ఉండి మొహానికి మెడకు పౌడర్ అప్లై చేసి మొహాన్ని సెట్ చేయడానికి చాలా బాగా పనికొస్తుంది. దీని బ్రిసిల్స్ చాలా సాప్ట్ గా ఉండడం వల్ల ఈ బ్రష్ ఉపయోగించి మొహానికి ఒక ఈవెన్ లుక్ తీస్కుని రావచ్చు. ఇది ఫ్లాట్ బ్రష్ లాగా మొత్తం ఒక దగ్గరే అప్లై చేయదు ఇది మొత్తం మొహమంతా సమాంతరంగా తెలీక పాటిగా రూపొందించడానికి ఉపయోగపడుతుంది.

చూశారుగా ఇవి బేసిక్ బ్రషస్ ఇంకా చాలానే ఉన్నాయి కానీ ఎక్కువగా వీటినే ఉపయోగిస్తూ ఉంటారు చాలా మంది. మీకు కూడా ఇవి ఉపయోగమనిపిస్తే తప్పక ఉపయోగించండి.





Untitled Document
Advertisements