ఇలా మీ ముఖాకృతిని కనుగొనడం సులభం

     Written by : smtv Desk | Mon, Jan 23, 2023, 04:31 PM

ఇలా మీ ముఖాకృతిని కనుగొనడం సులభం

మొఖం అందంగా కనిపించాలంటే మనం మన ముఖానికి చక్కగా నప్పే వస్తువులను ఉత్పత్తులను ఉపయోగించాలి లేదా మన ముఖంలో తక్కువగా కనిపించే భాగాలను హైలైట్ చేస్తూ ముఖం అందంగా కనిపించేలా చేయాలి. మనం వేసుకునే మేకప్ పెట్టుకునే ఆభరణాలను మన మొహానికి అందాన్ని ఇవ్వాలంటే మన మొహానికి సరిపడినట్టు తయారు కావాలి అలా అవ్వాలి అంటే ముందు మనకి ముఖం యొక్క ఆకారం ఏంటో తెలియాలి

మామూలుగా మన ముఖ ఆకారాలు చాలానే ఉంటాయి. కొందరి మొహాలు అయితే రెండు మూడు రకాల ముఖ ఆకారాలు కలిగి ఉంటాయి. అయితే ముఖ్యంగా వీటిని తొమ్మిది రకాలుగా విభజించారు. అవి గుండ్రని, ఓవల్, చతురస్రం, గుండె ఆకారం, వజ్రం, దీర్ఘచతురస్రం, దీర్ఘచతురస్రాకార త్రిభుజం మరియు విలోమ త్రిభుజం ముఖ ఆకారాలు.

మరి ఇన్ని రకాల్లో మీ ముఖం ఏ రకానికి చెందినదో మీకు ఎలా తెలుస్తుంది ?

మీ ముఖ ఆకృతిని తెలుసుకోవడం కోసం అలాగే మీ ముఖం యొక్క స్పష్టమైన రూపురేఖలను తెలుసుకోవడం కోసం ముందుగా జుట్టుని ముడి వేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల మీ ముఖం యొక్క సరైన ఆకృతి మీకు సులువుగా తెలుస్తుంది.
జుట్టు ముడివేసాక మీరు అద్దం ముందు నిలబడి అద్దంలో నుదుటి నుండి మొదలు మీ ప్రతిబింబాన్ని చూస్కుంటూ లిప్‌స్టిక్ లేదా లైనర్‌ని ఉపయోగించి అద్దంపై మీ ముఖం యొక్క రూపురేఖలను గీయడం మొదలు పెట్టండి. ఇది మీ ముఖాకృతిని గుర్తించడానికి ఒక కీలక అంశం.

లేదా మరొక విధానంలో కూడా మీ ముఖాకృతి గుర్తించవచ్చు

మీ ముఖ ఆకారాన్ని గుర్తించడానికి ఈ దశలను అనుసరించండి:-
1. కొలత:- మీ ముందుగానే జుట్టుని లాగి మూసివేశారు కాబట్టి మీ రూపురేఖలు స్పష్టంగా కనిపిస్తాయి. ఇప్పుడు ఒంటి కొలతలు కొలిచే టేప్‌ను తీస్కుని ముఖంపై పెట్టీ నొసటి వెడల్పు, చెంప ఎముక మరియు దవడ వెడల్పు, అలాగే ముఖం పొడవు వంటి నాలుగు ముఖ్యమైన దూరాలను కొలవండి. మీ ముఖాకృతిని కనుగొనడం కోసం ఈ కొలతలను కాగితంపై వ్రాయండి.
మీ ముఖ ఆకృతిని మరింతగా అర్థం చేసుకోవడానికి, మీరు మీ ముఖం యొక్క విశాలమైన భాగాన్ని కూడా కొలవవచ్చు. మీ ముఖం పొడవు మరియు వెడల్పు ఒకేలా ఉంటే, మీరు గుండ్రని ముఖం లేదా చతురస్రాకార ముఖం కలిగి ఉండే అవకాశం ఉంది.  ముఖం ఆకారం యొక్క పొడవు వెడల్పు కంటే ఎక్కువగా ఉంటే, మీరు ఓవల్ ముఖం ఆకారాన్ని కలిగి ఉండే అవకాశం ఉంది
2. మీ లక్షణాలను గమనించండి:- మీ మొహం యొక్క ఔట్లైన్ కనుగొనడం పూర్తైన తరువాత మీ మొఖంలోని చిన్న చిన్న విషయాలను సూక్ష్మ దృష్టితో గమనించాల్సిన దశ ఇది. అద్దంలో మీ ముఖాన్ని జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి. మీ దవడ ఆకారం ఎలా ఉంది?  లేదా మీ ముఖం ఎంత పొడవుగా ఉంది? అలాగే, మీ ముఖం యొక్క కోణాలు మరియు ఆకృతులపై శ్రద్ధ వహించండి.
3. మ్యాచ్:- ఇది చివరి దశకు వెళ్లండి. ఇప్పుడు, మీ ముఖం ఆకారాన్ని గుర్తించడానికి అవసరమైన మొత్తం డేటా మీ వద్ద ఉంది. 1 మరియు 2 దశల్లో మీరు పొందిన మీ కొలతలు మరియు ఇతర అవసరమైన పరిశీలనలు మీ వద్ద ఉన్నాయి. ఈ దశకు మీరు మీ ఫలితాలను ప్రతి ముఖ ఆకారాల లక్షణాలతో సరిపోల్చడం మరియు మీ ముఖాకృతిని కనుగొనడం అవసరం.

కాబట్టి వివిధ రకాల ముఖ ఆకృతుల గురించి ప్రత్యేకంగా వాటి లక్షణాల గురించి మరింత తెలుసుకుందాం.

• మొదటిగా గుండ్రని మొఖం. ఈ రకం ఆకృతిలో ముఖం యొక్క పొడవు మరియు వెడల్పు ఒకే విధంగా ఉంటాయి. దవడ మరియు గడ్డం గుండ్రంగా ఉంటాయి. నుదిటి వెంట్రుక రేఖ వద్ద కూడా గుండ్రంగా ఉంటుంది. ఇది వృత్తాకార రూపాన్ని కలిగి ఉన్న అందమైన సుష్ట ముఖ ఆకృతి. ఇందులో పెద్ద కోణాలు లేదా అంచులు ఉండవు. ఈ ముఖ ఆకృతిలో చీక్‌బోన్‌లు ప్రముఖంగా ఉండవు.
• రెండు చతురస్రాకార ముఖం ఆకారం. ఇది గుండ్రని ముఖ ఆకృతిని పోలి ఉంటుంది కానీ మరింత స్పష్టమైన లక్షణాలను కలిగి ఉంటుంది. ముఖం యొక్క పొడవు మరియు వెడల్పు ఒకే విధంగా ఉంటాయి. హెయిర్‌లైన్ చాలా సరళంగా ఉంటుంది. నుదిటి భాగం చెంప ఎముకలు మరియు దవడల వెడల్పుతో సమానంగా ఉంటుంది. దవడ బలంగా, పదునుగా మరియు చతురస్రాకారంగా ఉంటుంది
చీక్‌బోన్‌లో కనీస వక్రతలు ఉంటాయి.
• మూడవది గుండె ముఖం ఆకారం. ఇందులో ఒక గుండ్రని వెంట్రుక రేఖ ఉండి ఇది నుదిటి మధ్యలో ఆంగ్ల అక్షరమాల V ఆకారంలో ఒక బిందువుగా ఉంటుంది. నుదురు మరియు చెంప ఎముకలు దవడ కంటే వెడల్పుగా ఒకే వెడల్పుతో ఉంటాయి. గడ్డం ఇరుకైన దవడతో కోణీయంగా ఉంటుంది.
అలాగే ముఖం యొక్క పొడవు దాని వెడల్పు కంటే ఎక్కువగా ఉంటుంది.
• నాలుగవది కోల ముఖ ఆకృతి. ఈ ఆకృతిలో ముఖం యొక్క పొడవు దాని వెడల్పు కంటే ఎక్కువగా ఉంటుంది. చీక్బోన్లు ఈ ముఖ ఆకృతి యొక్క విశాలమైన లక్షణం మరియు ఇవి నుదురు భాగం కంటే కూడా వెడల్పుగా ఉంటాయి. కోల మొఖం ఉన్నవారికి గడ్డం మరియు దవడ గుండ్రంగా ఉంటాయి. ఇది ఆదర్శవంతమైన ముఖ ఆకృతిగా పరిగణించబడుతుంది.
• ఇక ఐదవది డైమండ్ ఫేస్ షేప్ అంటే వజ్రపు ఆకృతి. ఈ ఆకృతిలో నుదురు ఇరుకుగా మరియు గుండె ఆకారంలో ఉన్న ముఖంలో ఉంటుంది కానీ అంత వెడల్పుగా ఉండదు. చెంప తాలూకు ఎముకలు నుదురు మరియు దవడల కంటే వెడల్పుగా ఉంటాయి. గడ్డం గట్టిగా మరియు ఇరుకుగా ఉంటుంది. ముఖం యొక్క వెడల్పు పొడవు దాదాపు సమానంగా ఉంటుంది. చూడడానికి గుండె ఆకారంలో ఉన్నా నుదుటి భాగంలో ఇరుకుగా ఉండడం వల్ల దీని వజ్రపు ఆకృతిగా పరిగణించారు.
• ఆరవది దీర్ఘచతురస్ర ముఖం ఆకారం. ఇది ఓవల్ మరియు చతురస్రాకార ముఖ ఆకారాల కలయిక అని చెప్పవచ్చు. నుదురు, చెంప ఎముకలు మరియు దవడ ఒకే వెడల్పుతో ఉంటాయి. ముఖం దాని వెడల్పు కంటే రెండు రెట్లు ఎక్కువ పొడవుగా ఉంటుంది. దవడ బలంగా మరియు చతురస్రాకారంలో ఉంటుంది. చీక్‌బోన్‌లు కనిష్ట వంపులు కలిగి ఉంటాయి. ఈ ముఖ ఆకృతి యొక్క మరొక నిర్వచించే లక్షణం పొడవైన నుదురు భాగం అని చెప్పవచ్చు.
• ఏడవది త్రిభుజం ముఖం ఆకారం. ఇది ముఖంలో ఇరుకైన నుదిటి ప్రాంతాన్ని కలిగి ఉంటుంది. అలాగే ముఖం పొడుగుగా ఉన్న రూపాన్ని కలిగి ఉంటుంది. ఇందులో చెంప ఎముకలు అంత ప్రముఖంగా ఉండవు కానీ నిండుగా ఉంటాయి. త్రిభుజ ముఖం కోణీయ, విశాలమైన మరియు బలమైన దవడతో చతురస్రాకార రూపాన్ని కలిగి ఉంటుంది. ఇది గుండ్రని ముఖం వలె విశాలంగా ఉండి దవడ భాగం మృదువుగా ఉండే బొద్దుగా ఉంటుంది. దీని గడ్డం చతురస్రాకార రూపాన్ని కలిగి ఉంటుంది.

• ఇక చివరిది విలోమ త్రిభుజం ముఖం ఆకారం. విలోమ త్రిభుజం ముఖం ఆకారం యొక్క ప్రత్యేక లక్షణం ఏమిటంటే ఇది విశాలమైన నుదిటి మరియు కోణాల గడ్డం కలిగి ఉంటుంది. ముఖం యొక్క ఇరుకైన భాగం దవడ కాగా ముఖం వెడల్పు కంటే పొడవు ఎక్కువగా ఉంటుంది. ఈ రకం ఆకృతిలో నుదురు భాగం విశాలంగా ఉంటుంది.

ఈ పైన చెప్పిన దాని బట్టి మీ ముఖాకృతిని కంగుని దాని తగ్గట్టుగా మిమ్మల్ని మీరు మలచుకోండి.





Untitled Document
Advertisements