నందమూరి నట సింహ కోసం కథ సిద్దం చేస్తున్న స్టార్ డైరెక్టర్ !

     Written by : smtv Desk | Wed, Jan 25, 2023, 12:13 PM

నందమూరి నట సింహ కోసం కథ సిద్దం చేస్తున్న స్టార్ డైరెక్టర్ !

స్టార్ డైరెక్టర్ హరీశ్ శంకర్ కి మాస్ ఆడియన్స్ పల్స్ తెలిసిన డైరెక్టర్ గా ఫ్యాన్స్ లో మంచి క్రేజ్ ఉంది.. ఆయన సినిమాలకి కథ .. స్క్రీన్ ప్లే .. మాటలు అన్నీ తానే సమాకూర్చుకుంటాడు. మెగా హీరోలకు వరుసగా సక్సెస్ లను అందిస్తూ వెళ్లిన హరీశ్ శంకర్ , పవన్ తో మరోసారి సినిమా చేయాలనుకున్నాడు. అయితే ఆ ప్రాజెక్టు ఎప్పుడు మొదలవుతుందనేది తెలియదు.
చాలా కాలంగా ఆ ప్రాజెక్టు కోసమే వెయిట్ చేస్తూ వచ్చిన హరీశ్ శంకర్, ఇప్పుడు బాలకృష్ణ క్రేజ్ కి తగిన కథపై కసరత్తును మొదలెట్టినట్టుగా తెలుస్తోంది. బాలయ్యతో హరీశ్ ఒక చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నట్టుగా ఓ వార్త గత కొంతకాలంగా షికారు చేస్తోంది. అది నిజమేననే విషయం మొన్న 'వీరసింహారెడ్డి' ఫంక్షన్లో తేలిపోయింది.
బాలయ్య కోసం ఒక స్టోరీని రెడీ చేస్తున్నాననీ .. త్వరలోనే ఆయనకి వినిపించి ఓకే చేయించుకుంటానని హరీశ్ శంకర్ అన్నాడు. అంతేకాదు ఈ చిత్రాన్ని మైత్రీ వారు నిర్మిస్తారని హింట్ కూడా ఇచ్చాడు. ఇక స్టేజ్ పై బాలయ్య కూడా అదే విషయాన్ని స్పష్టం చేస్తున్నట్టుగా ఒక ప్రస్తావన తీసుకొచ్చారు. తదుపరి సినిమాను ఆయన అనిల్ రావిపూడితో చేయనున్నారు. ఆ తరువాత హరీశ్ శంకర్ తో సినిమా ఉంటుందని అనుకోవచ్చు. ఈ ఇద్దరి కంబోలో సినిమా గనుక సెట్స్ మీదకు వెళ్ళింది అంటే ఫ్యాన్స్ కు పండగే ఇక.





Untitled Document
Advertisements