బాలకృష్ణ ఇలాంటి వాఖ్యలు చేయడం సరికాదు.. రోజా

     Written by : smtv Desk | Wed, Jan 25, 2023, 03:07 PM

 బాలకృష్ణ ఇలాంటి వాఖ్యలు చేయడం సరికాదు.. రోజా

తాజాగా సీనియర్ స్టార్ హీరో రాజకీయ వేత అయిన నందమూరి బాలకృష్ణ చేసిన వాఖ్యలు అతనిని విమర్శల పాలు చేసాయి, ఆయన 'అక్కినేనా.. తొక్కినేనా' అంటూ చేసిన వ్యాఖ్యలు అక్కినేని ఫ్యాన్స్ కు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించాయి. మరోవైపు ఈ వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ టూరిజం మినిష్టర్, సినీ నటి రోజా స్పందించారు. అక్కినేని నాగేశ్వరరావుపై బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు సరైనవి
కాదని అభిప్రాయపడ్డారు. బాలకృష్ణ చేసే ఇలాంటి వ్యాఖ్యలు సరికాదని అన్నారు. బాలకృష్ణ ఇలాంటి వ్యాఖ్యలు చాలా సందర్భాల్లో చేశారని విమర్శించారు. ఎన్టీఆర్ పై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఎలా ఉంటుందో బాలయ్య ఒక్కసారి ఆలోచించుకోవాలని హితువు పలికారు. ఇదిలా ఉండగా ఇటీవలే చిరంజీవిపై కూడా రోజా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. ఇప్పుడు బాలయ్యపై ఆమె చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి.





Untitled Document
Advertisements