‘పఠాన్’ కలెక్షన్ల సునామీ.. సినిమాపై రామ్ గోపాల్ వర్మ ‘రివ్యూ’

     Written by : smtv Desk | Fri, Jan 27, 2023, 01:48 PM

‘పఠాన్’ కలెక్షన్ల సునామీ.. సినిమాపై రామ్ గోపాల్ వర్మ ‘రివ్యూ’

కొంతకాలంగా సరైన హిట్ సినిమాలు లేక బాలీవుడ్‌ గడ్డు పరిస్థితిని ఎదుర్కుంటున్న విషయం తెలిసిందే. ఎటువంటి పరిస్థితుల్లో విడుదలైన చిత్రం ‘పఠాన్’. బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘పఠాన్’ హిట్ టాక్ తో దూసుకెళ్తోంది. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. రెండు రోజుల్లోనే రూ. 200 కోట్ల పైచిలుకు కలెక్షన్లు రాబట్టి ఔరా అనిపిస్తోంది. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వచ్చిన ఈ యాక్షన్ సినిమాలో షారుక్ సరసన దీపికా పదుకొణే హీరోయిన్ గా నటించింది. పలు భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా బుధవారం విడుదలైంది. తొలిరోజే ప్రపంచ వ్యాప్తంగా రూ.100 కోట్ల వసూళ్లు రాబట్టింది.దాంతో తొలిరోజు అత్యధిక క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన బాలీవుడ్‌ సినిమాగా రికార్డు సృష్టించింది.
అయితే, విజయవంతంగా ప్రదర్శితమవుతున్న ఈ సినిమాపై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు. స్వభావ రీత్యా మిగతావారికి భిన్నంగా ఆలోచించడం, మాట్లాడడం అలవాటున్న వర్మ ఇప్పుడు పఠాన్ సినిమాపైనా అదే రీతిలో తన అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఈ సినిమా నాలుగు అపోహలను పటాపంచలు చేసినట్టు ప్రకటించారు. ఇందుకు సంబంధించి ట్విట్టర్ లో వర్మ తన అభిప్రాయాలను షేర్ చేశారు.

‘‘1. ఓటీటీ కాలంలో కలెక్షన్లు గొప్పగా ఉండవు.
2. ఎస్ఆర్కే (షారూక్ ఖాన్) ఫేడింగ్ (ఆదరణ కోల్పోతున్న) స్టార్.
3. దక్షిణాది మసాలా దర్శకుల మాదిరి బాలీవుడ్ దర్శకులు కమర్షియల్ బ్లాక్ బస్టర్ తీయలేరు.
4. కేజీఎఫ్ మొదటి రోజు కలెక్షన్ల రికార్డును బ్రేక్ చేయడానికి కొన్నేళ్లు పడుతుంది.
ఈ అపోహలన్నీ పఠాన్ ద్వారా పటాపంచలయ్యాయి’’ అంటూ రామ్ గోపాల్ వర్మ రాసుకొచ్చారు.
https://twitter.com/RGVzoomin/status/1618830313379209217?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1618830313379209217%7Ctwgr%5Ec1eaa9fcae6f27983fbd5985cd54304a938116fa%7Ctwcon%5Es1_c10ref_url=https%3A%2F%2Fwww.ap7am.com%2Fflash-news-763155%2Fram-gopal-varma-reveals-shah-rukh-khans-pathaan-broke-four-myths






Untitled Document
Advertisements