జలుబు చేసినపుడు ఆహరం రుచి, వాసన మనం గుర్తించలేం?

     Written by : smtv Desk | Mon, Jan 30, 2023, 12:15 PM

జలుబు చేసినపుడు ఆహరం రుచి, వాసన మనం గుర్తించలేం?

మనకు జలుబు చేసినప్పుడు ఇది అని చెప్పుకోలేని విధంగా ఉంటుంది ఆ భాద. ముక్కులో నుండి నీరు కారడం, తుమ్ములు రావడం. తలంతా బరువైన ఫీలింగ్ తో పాటు తల ఊడి కిందపడుతుందేమో అనే భావన కలుగుతుంది. అంతే కాదు జలుబు చేసిన సమయంలో ఇది తినాలి, తాగాలి అనే ఫీలింగ్ ఉండదు. ఒకవేళ బలవంతంగా తిన్నా ఆహారపదార్థాల రుచి , వాసనని మనం గుర్తించలేము. ఇలా జరగడానికి కారణం..మనం ఆహారం తీసుకునేటపుడు మన ముక్కు నాలుక కలిపి పనిచేస్తాయనే విషయం మనలో చాల మందికి తెలియదు ఆహారం వాసన చూడటానికి ముక్కు సహాయపడితే, దాన్ని రుచి చూడటానికి నాలుక సహాయపడుతుంది. ఈవిధంగా మనం ఆహారం,.. -పానీయం వివిధ సువాసనలను గుర్తించగలుగుతాం, రుచి చూస్తాం, మెచ్చుకుంటాం, అయితే మనకు జలుబు చేసినపుడు, మన ముక్కు, దాని పై పొరలు మూసుకుపోతాయి. మనం సవ్యంగా గాలిపీల్చుకునేందుకు సహాయపడటానికే ముక్కు తన శక్తినంతా ఉపయోగిస్తుంది. అందువల్ల వాసన, రుచి చూసే మన జ్ఞానం బలహీనమవుతుంది. మనం ఏ ఇతర సువాసనకన్నా ఎక్కువగా ఉప్పదనాన్ని తీసుకుంటాం. అందువల్ల మనం రుచిచూసే ఆహారం అంతా చెప్పగా, రుచిరహితంగా వుంటుంది.





Untitled Document
Advertisements