జారుడు బల్లలు నునుపుగా ఎందుకు వుంటాయి?

     Written by : smtv Desk | Mon, Jan 30, 2023, 12:46 PM

జారుడు బల్లలు నునుపుగా ఎందుకు వుంటాయి?

మన చిననాటి రోజులు గుర్తు చేసుకుంటే అందమైన ఆటపాటల బాల్యంలో మనకు మొదట గుర్తొచ్చేది ఉయ్యాల బల్ల, జారుడు బల్ల మొదటి స్థానంలో ఉంటాయి. ఊయ్యాల బల్లపై మన కుర్చుని కాళ్ళని నేలకి తొక్కిపెట్టి వెనెక్కి ఊగినప్పుడు ఊయ్యాల ఊగుతుంది. లేదా ఎవరైనా దానిని ఊపిన అది వేగంగా ఊగుతుంది. ఆ విషయం మనకు తెలిసిందే. అయితే, జారుడు బండ పై కూర్చోగానే మన ప్రమేయం లేకుండా కిందకి జారిపోతుంటాము. కారణం జారేటప్పుడు మన శరీరాలు జారుడు ఉపరితలంపై ఎప్పుడూ రాచుకుంటూ "ఉపరితలం గరుకుగా వున్నట్లయితే ప్రతిఘటన, రాపిడి హెచ్చుగా వుంటుంది. కాబట్టి జారుడు హాయిగా వుండదు. అందువల్ల జారుడు బల్లలను ఎటువంటి ప్రతిఘటన, రాపిడి లేకుండా వుంచే నిమిత్తం నునుపుగా తయారుచేస్తారు. జారుడుబల్లలు తయారీకి లోహం వంటి పదార్థాన్ని ఉపయోగించినట్లయితే సిమెంటు, ముతక ప్లాస్టిక్ కన్నా తక్కువ ప్రతిఘటన వుంటుంది.





Untitled Document
Advertisements