అరచేతిలో కేంద్ర బడ్జెట్?.. ఎలా అంటే!

     Written by : smtv Desk | Tue, Jan 31, 2023, 12:45 PM

అరచేతిలో కేంద్ర బడ్జెట్?.. ఎలా అంటే!

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ బుధవారం నాడు పార్లమెంట్ లో కేంద్ర వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. గడిచిన రెండేళ్లుగా పేపర్ లెస్ విధానంలో బడ్జెట్ ప్రవేశపెడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బడ్జెట్ ను ప్రభుత్వం సామాన్యులకూ అందుబాటులో ఉంచుతోంది. పార్లమెంట్ వెబ్ సైట్ తో పాటు మొబైల్ యాప్ లోనూ అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపింది. మొబైల్ యాప్ లో బడ్జెట్ లోని ప్రతీ పేజీని వివరంగా చూడొచ్చని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. పార్లమెంట్ లో ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ ప్రసంగం పూర్తయిన తర్వాత యాప్ లో బడ్జెట్ ను చూడొచ్చని పేర్కొన్నాయి.

అయితే, కేంద్ర బడ్జెట్ ను మీ మొబైల్ ఫోన్ లోనే చూడాలంటే ప్లే స్టోర్ నుంచి యూనియన్ బడ్జెట్ (యూబీ) యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి. కేంద్ర ప్రభుత్వ అధికారిక వెబ్ సైట్ నుంచి కూడా యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఇంగ్లీష్, హిందీ భాషలలో బడ్జెట్ ప్రతులు ఇందులో అందుబాటులో ఉంటాయి. గ్రాంట్స్, ఫైనాన్స్ బిల్లులతో పాటు బడ్జెట్ లోని 14 పత్రాలు ఈ యాప్ లో చూడొచ్చు. బడ్జెట్ హైలెట్స్ ను కూడా యాప్ లో చదువుకోవచ్చు. ఇందులోని పేపర్లను కావాల్సినంతగా జూమ్ చేసుకుని చూసేలా యాప్ ను డిజైన్ చేశారు. ఒకవేళ సమావేశాలు చూసే అవకాశం మీకు లేకున్నా ఇందులో పొండుపరించిన వివరాలను చూసి అన్ని విషయాలను తెలుసుకునే వెసలుబాటు ఉంటుంది.





Untitled Document
Advertisements