మారిన శాకుంతలం రిలీజ్ డేట్.. కారణం ఆ సినిమానే !

     Written by : smtv Desk | Wed, Feb 01, 2023, 11:18 AM

మారిన శాకుంతలం రిలీజ్ డేట్.. కారణం ఆ సినిమానే !

ఈ మధ్యకాలంలో స్టార్ హీరోయిన్ సమంత నాయిక ప్రాధాన్యత ఉన్న పాత్రలలో ఎక్కువగా నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా సమంత టైటిల్ రోల్ గా తెరకెక్కిన చిత్రం శాకుంతలం. ఈ చిత్రం షూటింగ్ పనులు పూర్తి చేసుకుని విదుదలకు సిద్దంగా ఉంది. అంతేకాక ఈ చిత్ర రిలీజ్ డేట్ ని కూడా అనోన్స్ చేసారు మేకర్స్. కానీ, ప్రస్తుతం శాకుంతలం సినిమా విడుదల వాయిదా పడినట్టు తెలుస్తోంది. అధికారికంగా ప్రకటన విడుదల కాలేదు. కానీ, ఈ వ్యవహారం తెలిసిన వర్గాలు దీన్ని వెల్లడించాయి. వాస్తవానికి ఈ సినిమా ఈ నెల 17న రిలీజ్ కావాల్సి ఉంది. తెలుగు, తమిళం, హిందీలో రిలీజ్ కు సినిమా నిర్మాతలు నిర్ణయించారు. అయితే, ఇప్పుడు పఠాన్ సినిమా భారీ వసూళ్లతో రికార్డులు నమోదు చేస్తోంది. పఠాన్ కు భారీ ఆదరణ వస్తున్న ఈ సమయంలో శాకుంతలం హిందీ వెర్షన్ రీలీజ్ సరికాదని నిర్మాతలు భావిస్తున్నట్టు తెలుస్తోంది.

కనుక ముందుగా అనుకున్నట్టు ఫిబ్రవరి 17న కాకుండా, కొన్ని రోజుల తర్వాతే శాకుంతలం విడుదల చేయాలనే ఆలోచనతో ఉన్నట్టు తెలిసింది. ఈ సినిమాకు గుణశేఖర్ దర్శకత్వం వహించాడు. పఠాన్ ఉత్తరాదిన భారీ విజయాన్ని నమోదు చేస్తోంది. కనుక తగినన్ని స్క్రీన్లు లభించకపోవచ్చని శాకుంతలం టీమ్ భావిస్తోంది. కార్తీక్ ఆర్యన్ నటించిన షెజదా సినిమా సైతం ఫిబ్రవరి 10న విడుదల కావాల్సి ఉండగా, దాన్ని కూడా వాయిదా వేసుకున్నారు. దీంతో మార్చి నెలలో శాకుంతలం విడుదల చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. దీనిపై అధికారికంగా ప్రకటన విడుదల కానుంది.





Untitled Document
Advertisements