హైలైట్స్-1.. కేంద్ర వార్షిక బడ్జెట్..

     Written by : smtv Desk | Wed, Feb 01, 2023, 12:19 PM

 హైలైట్స్-1.. కేంద్ర వార్షిక బడ్జెట్..

2023-24 వార్షిక బడ్జెట్ ను కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంలో ఆమె వివిధ రంగాలకు కేటాయింపులను ప్రకటించారు. బడ్జెట్ లో మూలధన వ్యయం మొత్తం రూ.10 లక్షల కోట్లు అని వెల్లడించారు.

వ్యవసాయ రుణాల కోసం రూ.20 లక్షల కోట్లు
శ్రీ అన్నపథకం ద్వారా చిరుధాన్యాల రైతులకు ప్రోత్సాహం
పీఎం మత్స్య సంపద యోజనకు అదనంగా రూ.6 వేల కోట్లతో ప్రత్యేక పథకం
ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యానికి మరింత ప్రాధాన్యత
గ్రీన్ ఎనర్జీ రంగంలో మరిన్ని ఉపాధి అవకాశాలు

వ్యవసాయ స్టార్టప్ ల ప్రోత్సాహనికి ప్రత్యేకంగా నిధుల కేటాయింపు
వచ్చే మూడేళ్లలో కోటి మంది రైతులను సేంద్రియ సేద్యం వైపు మళ్లింపు
రైతుల కోసం 10 వేల బయో ఇన్ పుట్ రిసోర్స్ కేంద్రాల ఏర్పాటు
దేశంలోని 63 వేల వ్యవసాయ పరపతి సంఘాల డిజిటలైజేషన్
పరపతి సంఘాల డిజిటలైజేషన్ కు రూ.2 వేల కోట్లు

ఫార్మా రంగ అభివృద్ధికి ప్రత్యేక పథకం
సికిల్ సెల్ వ్యాధి గ్రస్తులకు ప్రత్యేక తోడ్పాటు
నేషనల్ డిజిటల్ లైబ్రరీ వ్యవస్థకు ప్రోత్సాహం
గిరిజనుల కోసం పీవీటీజీ పథకం ఏర్పాటు

రాష్ట్రాలకు వడ్డీ లేని రుణాల పథకం మరో ఏడాది పొడిగింపు
రాష్ట్రాలకు వడ్డీ లేని రుణాల పథకం కోసం రూ.13.7 లక్షల కోట్లు
రైల్వే శాఖకు రూ.2.40 లక్షల కోట్లు కేటాయింపు
2013-14తో పోల్చితే రైల్వేలకు 9 రెట్లు అధికంగా నిధులు

కీలకమైన 100 మౌలిక వసతుల ప్రాజెక్టులకు రూ.75 వేల కోట్లు
ఫలితాల ఆధారంగా కేంద్ర ప్రభుత్వ పథకాలకు నిధుల కేటాయింపు
ఏకలవ్య పాఠశాలలకు 38,800 మంది ఉపాధ్యాయుల నియామకం
పీఎం ఆవాస్ యోజనకు రూ.79 వేల కోట్లు

5జీ సేవల యాప్ ల అభివృద్ధి కోసం 100 పరిశోధనా సంస్థలు
ఈ-కోర్టుల ఏర్పాటుకు రూ.7 వేల కోట్లు
ఎంఎస్ఎంఈలు, ఎన్జీవోలు, వ్యాపార సంస్థలకు డిజిలాకర్ సేవల విస్తరణ

కాలం చెల్లిన వాహనాల తొలగింపునకు తక్షణ ప్రాధాన్యత
కేంద్ర ప్రభుత్వ వాహనాలు మార్చేందుకు ప్రత్యేక నిధులు
కొత్త వాహనాల కొనుగోలుకు రాష్ట్రాలకు కూడా సాయం
నీతి ఆయోగ్ మరో మూడేళ్ల పాటు పొడిగింపు
పట్టణ మౌలిక వసతుల అభివృద్ధికి ఏటా రూ.10 వేల కోట్లు





Untitled Document
Advertisements