పురుషుడితో కరచాలనం విషయంలో స్త్రీ ఇబ్బంది పడడానికి కారణం ?

     Written by : smtv Desk | Wed, Feb 01, 2023, 12:45 PM

పురుషుడితో కరచాలనం విషయంలో స్త్రీ ఇబ్బంది పడడానికి కారణం ?

కొన్ని శతాబ్దాలుగా స్త్రీలు అన్ని రంగాలలోను పురుషులతో సమానంగా దూసుకుపోతున్నప్పటికీ, పరస్పర అభినందనల విషయానికొచ్చేటప్పటికి స్త్రీ పురుషులు తడబాటుకు, ఇబ్బందికి లోనవుతూనే ఉన్నారు. కరచాలనానికి సంబంధించి. తాము చిన్నతనం నుంచీ తమ తండ్రుల వద్ద శిక్షణ పొందామని పురుషులు చెబుతుంటారు. స్త్రీల విషయంలో ఇలాంటి శిక్షణేదీ అనేది మనం ఎంత వెతికినా కనిపించదు. దాని ఫలితంగా పెరిగి పెద్దవాళ్ళయ్యాక తమతో పనిచేసేతో మగవారు, లేదా ఇతర పురుషులు ఎవరైనా కరచాలనం చేయడానికి ముందుకు వచ్చిన సందర్భాల్లో మహిళలు ఆ విషయాన్ని గుర్తించక తొలుత పురుషులు ముఖంలోకి చూస్తారు. పురుషుడు కరచాలనం కొరకు తన చేతిని ముందుకు చాచిన కూడా స్త్రీలు స్పందించక పోవడంతో గాలిలో ఉన్న తన చేతిని ఇబ్బంది పడుతూ పురుషుడు వెనక్కి తీసుకుంటాడు. అదే సమయంలో పురుషుని ఉద్దేశాన్ని కాస్త ఆలస్యంగా గ్రహించిన స్త్రీ తన చేతిని ముందుకు చాపినప్పటికీ, అది ఖాళీగా గాలిలో నిలుస్తుంది. తరువాత పురుషుడు మహిళ ఆంతర్యాన్ని గ్రహించి తన చేతిని మళ్లీ ముందుకు చాపుతాడు. ఈ తడబాటులో వారిద్దరి చేతులూ చిక్కుబడిన వేళ్లతో తత్తరపాటుకు గురువుతాయి. అదేదో ప్రేమలో పడిన జంట తొలిసారిగా కౌగిలిలో చిక్కుకున్నట్టుగా వీరిద్దరూ ఊపిరి సలపని ఒత్తిడికి గురవుతారు.
పురుషుల మధ్య తొలి కరచాలనం చేతకానితనంవల్ల. విఫలమవడంతో వారి తొలి సమాగమం విఫలమవుతుంటుంది.
మీకెప్పుడైనా ఇలాంటి అనుభవం ఎదురైతే, వెంటనే ఎదుటి వ్యక్తి కుడిచేతిని మీ ఎడమ చేతితో పట్టుకోండి. దాన్ని సరిగ్గా మీ కుడిచేతిలో ఇమిడేలా ఉంచుకోండి. అప్పుడు నవ్వుతూ 'మనం మళ్ళీ ప్రయత్నిద్దాం!" అని చెప్పండి. దీంతో మీ పట్ల అవతలి వ్యక్తిలో విశ్వసనీయత అమాంతం పెరుగుతుంది. ఎందుకంటే తనతో పరిచయానికి మీరెంతో విలువనిస్తున్నారని, అందుకే తగిన విధంగా కరచాలనం చేయడానికి ఉత్సాహ పడుతున్నారని ఎదుటి వ్యక్తి భావిస్తాడు. మీరు వాణిజ్యరంగంలో కృషి చేస్తున్న మహిళ అయితే, కరచాలనం చేయడానికి బిడియ పడకుండా మీరెల్లప్పుడూ సిద్ధంగా ఉన్నారని అందరూ గుర్తించేలా ప్రవర్తించండి. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మీ చేతిని ముందుకు అందించండి. దీనివల్ల తడబాటును అధిగమించవచ్చు.





Untitled Document
Advertisements