ఏ వస్తువుల ధరలు తాగ్గుతాయి?.. ఏవి పెరుగుతాయి?.. కేంద్ర వార్షిక బడ్జెట్

     Written by : smtv Desk | Wed, Feb 01, 2023, 12:49 PM

ఏ వస్తువుల ధరలు తాగ్గుతాయి?.. ఏవి పెరుగుతాయి?.. కేంద్ర వార్షిక బడ్జెట్

దేశప్రజలంతా ఎదురుచూస్తున్న వార్షిక బడ్జెట్ ను నేడు ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర ప్రభుత్వ వార్షిక బడ్జెట్ ను ప్రకటించారు. పార్లమెంటులో ఆమె బడ్జెట్ ప్రసంగం చేశారు. పర్యావరణ హిత చర్యల్లో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగానికి పెద్దపీట వేస్తున్నట్టు నిర్మల తెలిపారు. ఎలక్ట్రిక్ వాహనాలపై కస్టమ్స్ సుంకం తగ్గిస్తున్నట్టు వెల్లడించారు. అదే సమయంలో టీవీ ప్యానెళ్లపైనా ఉదారంగా వ్యవహరించారు. మొత్తమ్మీద పలు వస్తువులపై కస్టమ్స్ సుంకం తగ్గించారు. అటు, బంగారం, వెండిపై కస్టమ్స్ సుంకం పెంచారు.

ధరలు తగ్గేవి..
ఎలక్ట్రిక్ వాహనాలు
టీవీలు, మొబైల్ ఫోన్లు
కిచెన్ చిమ్నీలు
లిథియం అయాన్ బ్యాటరీలు

ధరలు పెరిగేవి..
టైర్లు
సిగరెట్లు
బంగారం, వెండి
వజ్రాలు
బ్రాండెడ్ దుస్తులు
విదేశాల నుంచి దిగుమతి అయ్యే రబ్బరు

Untitled Document
Advertisements