స్త్రీలలో గర్భాశయం తొలగించడం వలన తలెత్తే సమస్యలు.. ఆయుర్వేదంలో వాటి పరిష్కారాలు

     Written by : smtv Desk | Wed, Feb 01, 2023, 01:14 PM

స్త్రీలలో గర్భాశయం తొలగించడం వలన తలెత్తే సమస్యలు.. ఆయుర్వేదంలో వాటి పరిష్కారాలు

ఒక అమ్మాయి పరిపూర్ణ స్త్రీగా మారే సమయంలో ఆమె అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అటువంటి సమయంలో స్త్రీలలో వచ్చే గర్భాశయ సమస్యలు.. పి.సి.ఓ.డి. ప్రస్తుత రోజులలో ఏ చిన్న సమస్య వున్నా మరో ఆలోచన లేకుండా గర్భాశయాన్ని తొలగిస్తున్నారు. నిజానికి గర్భాశయం తొలగించడం స్త్రీ ఆరోగ్యానికి అత్యంత హానికరం. గర్భాశయాన్ని తీసివేయుట వలన హార్మోనల్ ఇంబాలెన్స్తో చాలా సమస్యలు తలెత్తుతున్నాయి. లావు పెరుగుట, క్యాల్షియం శరీరం వాడుకోక ఎముకల పటిష్టత తగ్గిపోవుట, ఎముకల అరుగుదల, పెళుసుబారి చిన్న దెబ్బలు తగిలినా విరుగుట, పగులుట జరుగుతుంది. ఈ సమస్య పోవాలంటే 5,6 రావి చెట్టు ఆకులు తెంపి మంచిగా కడిగి ముక్కలుగా కోసి కషాయం చేసుకుని రోజూ తాగితే తగ్గిపోతుంది. చిరుధాన్యాలలో సామలు ఎక్కువగా తినాలి. సామలు జననాంగాలను శుద్ధి చేసే గుణము కలిగి వున్నది. 4 రోజులు సామలు మిగిలిన రోజులలో అరికెలు 2 రోజులు, ఊదలు రెండు రోజులు, కొర్రలు 2 రోజులు, అండుకొర్రలు రెండు రోజులు తినాలి. మరల ఇదే విధంగా మరల పండుకొని తినాలి. మంచి ఫలితం కనబడుతుంది. స్త్రీలలో వచ్చే గర్భాశయ గడ్డలు నెలసరి సక్రమముగా రాకపోవుట అన్నీ సమస్యలకు పుంటి కూర ఆకులు 10 ఆకుల వరకు కషాయం చేసి తాగితే కొన్ని రోజులకు సమస్య తగ్గిపోతుంది.
అదేవిధంగా గర్భాశయం తొలగించడం వలన ఆహారంలోని క్యాల్షియం వినియోగించుకునే హార్మోన్ విడుదల కాదు. అప్పుడు ఎముకలు పెళుసుబారి పోవుట, చిన్న దెబ్బ తగిలినా ఎముకలు విరిగిపోవుట, ఎముకలు, కీళ్ళ మధ్యలో అరుగుదల, నడుమ డిస్క్లు కదులుట, కాళ్ళు, చేతులు తిమ్మిర్లు వస్తాయి. ఇలాంటివారు రోజూ సున్నం ఒక గ్రాము నుండి రెండు గ్రాముల వరకు తమలపాకులో గాని మజ్జిగలో గాని, లేదా నీటిలో గాని కలిపి తాగాలి. ఇలా చేయడం వలన క్యాల్షియం లోపం రాదు. సున్నం వాతాన్ని హరిస్తుంది. కఫాన్ని తగ్గిస్తుంది. సుఖనిద్ర వస్తుంది. అయితే బజారులో దొరికే సున్నం వాడకూడదు. సున్నపు రాళ్ళను కాల్చి తయారుచేస్తారు. అలాంటి సున్నం తెప్పించి ఉపయోగిస్తే మంచి ఫలితం వుంటుంది.





Untitled Document
Advertisements