యాదవులను గాంధారీదేవి శపించుటకు కారణం?

     Written by : smtv Desk | Fri, Feb 03, 2023, 11:40 AM

యాదవులను గాంధారీదేవి శపించుటకు కారణం?

మన పురాణ ఇతిహాసాలను చదివినప్పుడు మనకు ఎన్నో విషయాలు తెలుస్తాయి. ప్రస్తుతంలో జరుగుతున్న విషయాలను గురించి ఆనాడే మన పురాతన గ్రంధాలలో పొందుపరచడం జరిగింది. ముఖ్యంగా బగవద్గీత ఇది నేటి మన జీవనరేఖ వంటిది.
యాదవులు మహాభారత కాలంలో శాపానికి గురైన విషయం తెలిసిందే. అయితే, వారి శాపానికి గల కారణం ఏంటి అంటే మహాభారత యుద్ధంలో గాంధారీ పుత్రులు కౌరవులు నూరు గురు మరణించినందుకు ఆమె ఎంతో కుమిలిపోయింది ఎన్నో ఔక్షిహిణీల సైన్యం సమసిపోయి అంతా సర్వనాశనం అయిపోయింది. కౌరవులు అనేవారు లేకుండా పోయారు. ఈ మరణకాండకు కారణం శ్రీకృష్ణుడేనని గాంధారి ఎంతో ఆవేదన చెందింది. ఒకనాడు తన వద్దకు వచ్చిన కృష్ణునితో నాకు కలిగిన పుత్రశోకానికి కారణం నువ్వే కృష్ణ! అని కృష్ణున్ని నిందిస్తూ నా కుమారుల్ని ఎలా నామరూపాలు లేకుండా చేసావో నీ వంశం కూడా అలాగే నామరూపాలు లేకుండా పోతుందని ఆవేశంతో శపించింది. ఆనాడు ఆ శాప ప్రభావంతో ఇప్పుడు ఆ శాపకాలం ప్రాప్తించి అదుపాజ్ఞలు లేనివారై విచ్చలవిడిగా ప్రవర్తించడం ప్రారంభించారు.





Untitled Document
Advertisements