ప్రయాణాలలో సూట్కేస్ తలక్రింద పెట్టుకుంటున్నారా? అయితే ఈ విషయం తెలుసుకోండి

     Written by : smtv Desk | Fri, Feb 03, 2023, 12:02 PM

ప్రయాణాలలో  సూట్కేస్ తలక్రింద పెట్టుకుంటున్నారా? అయితే ఈ విషయం తెలుసుకోండి

మన శరీరంలో అన్ని భాగాలు సక్రమంగా పనిచేసినప్పుడే మనం అత్యంత చురుకుగా పనులను చక్కబెట్ట గలము. అలా కాదాని ఏదైనా ఒక్క అవయవం బాధతో విలవిలలాడినా మన పూర్తి శరీరం పై ఆ ప్రభావం పడుతుంది. ఉదాహరణకు మెడ నొప్పిని తీసుకుందాం.. మెడ భాగంలో నొప్పి అనేది ఏర్పడినప్పుడు కనీసం మనం తల తిప్పి కూడా చూడలేము. అటువంటి సందర్భాలలో మనం ఈ కొద్దిపాటి జాగ్రత్తలు పాటించగలిగితే మెడ నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది.
మీరు పడుకునేప్పుడు వేసుకునే పక్కగానీ, పరుపుగానీ, దిళ్ళుగానీ సుఖంగా, మెత్తగా వుండాలి. ముఖ్యంగా మెడకింద సపోర్ట్ వుండే దిండు తప్పనిసరిగా మెత్తది కావాలి. రాయిలాగా వుండే దిళ్ళూ, తలగడ లాంటి పెద్దపెద్ద పుస్తకాలు, చిన్న చిన్న పెట్టెలు, ఇలాంటివి తలగడకు పనికొచ్చే వస్తువులు కావు.. వీటిని ఎట్టి పరిస్థితుల్లోను తల క్రింద పెట్టుకోకూడదు. అంత కాకుండా ప్రయాణం చేసేటప్పుడు కూడా 'ఎయిర్ పిల్లో' తీసుకువెళ్ళండి గానీ, మీ సూట్కేస్నే తలకింద పెట్టుకొని పడుకోకండి.
అందువలన మెడలోని వెన్ను పూసల్లో వ్యాధులు వచ్చేందుకు అవకాశం వుంది. 'సర్వయికల్ స్పాండో లైసిస్' వంటి మెడవ్యాధులకు శాశ్వత నివారణ లేదు. గుర్తు పెట్టుకోండి.





Untitled Document
Advertisements