యాదవులు ఋషుల శాపానికి ఎలా గురయ్యారు.. కృష్ణుని సహాయంతో ఏ విధంగా శాప విమోచనం పొందారు?

     Written by : smtv Desk | Fri, Feb 03, 2023, 12:29 PM

యాదవులు ఋషుల శాపానికి ఎలా గురయ్యారు.. కృష్ణుని సహాయంతో ఏ విధంగా శాప విమోచనం పొందారు?

మహాభారత ప్రకారం యాదవులు ఋషుల శాపానికి గురైన సంగతి తెలిసిందే. వారికి కలిగిన శాపం కారణంగా వారి వశం అంతరించిపోయే ప్రమాదం ఏర్పడింది. అప్పుడు వారు కృష్ణున్ని వేడుకుని శాప విమోచనం పొందారు. అసలు ఆ శాపం ఏంటి? ఎలా ఏర్పడింది? కృష్ణుడు వారికి శాప విమోచనం ఎలా కలిగించాడు అనే విషయాలు తెలుసుకుందాం.. "వాసుదేవా! మానవ జీవితంలో సర్వరోగాలకు దివ్య ఔషధం నీ నామమే అని తెలియక ఈ మానవులు దుర్బుద్ధులై కొట్టుకుంటున్నారు. ఈ సర్వ బ్రహ్మాండంలో అను రూపంలో ఉన్న నీకు నమస్కారం" అని ఆ మహా ఋషులందరూ అనేక ప్రార్ధనలు చేసి, సెలవు తీసుకొని ద్వారకకు సమీపంలోనున్న పిండారక తీర్థానికి వచ్చారు. అప్పటికే గర్వాంధులైన ఈ యాదవులు ఈ రుషులను చూసి ఒక ఆట ఆడిద్దామని వారి చెంతకు చేరారు. ఆ బృందంలో సాంబారు అనే యువకుడు స్త్రీ వేషం వేసి నిండు గర్భవతిగా కనిపించే విధంగా తయారు చేసి మునుల వద్దకు తీసుకొని వచ్చారు.
అందరూ మునులకు నమస్కారం చేసి " ఈ స్త్రీకి పుట్టే సంతానం స్త్రీయా లేక పురుషుడా?" అని ప్రశ్నించారు. త్రికాల జనులైన ఋషులు విషయం గ్రహించి, " నాయనలారా! ఈ గర్భిణీకి ముసలం పుడుతుంది. దానివల్ల మీ జాతి యావత్తు నశిస్తుంది" అని చెప్పి వెళ్లిపోయారు.
ఆ మాటతో యాదవులు గజగజలాడి సాంబుని వస్త్రాలు విప్పుతుండగానే ముసలం రోకలి బయటపడుతుంది. ఆ రోకలి పట్టుకొని అందరూ శ్రీకృష్ణుని సమీపించి జరిగిన కథ చెప్పగా ఆయన" వారి శాపానికి తిరుగులేదు. మదమత్తతకు అదే ప్రాయశ్చిత్తం " అన్నాడు. వారు పరి పరి విధాల వేడగా, " సముద్ర తీరంలో ఒక పర్వతం మీద దీన్ని అరగదీసి, ఆ పొడి సముద్రంలో కలపండి " అని చెప్పి పంపాడు. వారు శ్రీకృష్ణుడు చెప్పిన విధంగా సముద్రం వద్దకు పోయి అహోరాత్రులు అరగదీసి చివరకు చిన్న ముక్క మిగలగా దాన్ని సముద్రంలో విసిరి పారేశారు. ఆ ముక్కను ఓ చేప మింగింది. ఆ చేపను పట్టిన జలారి దానిని కోసి, ఆ చెక్క ముక్కను చూసి ఎంత వాడిములుకును తన బాణానికి తొడిగితే వేట బాగా సాగుతుందని తన వద్ద ఉన్న ఒక బాణం చువ్వకు దానిని అమర్చి ఉంచారు.

Untitled Document
Advertisements