ఎమ్మెల్యే కోటంరెడ్డి వలస నిర్ణయం తీసుకునే వైసీపి పై బురద జల్మంలుతున్త్రినారు.. కాకాణి ధ్వజం

     Written by : smtv Desk | Fri, Feb 03, 2023, 12:36 PM

ఎమ్మెల్యే కోటంరెడ్డి వలస నిర్ణయం తీసుకునే వైసీపి పై బురద జల్మంలుతున్త్రినారు..  కాకాణి ధ్వజం

ప్రస్తుతం ఏపీలో అధికార పక్షంలో వలసల పర్వం మొదలైంది. ఒక్కొక్కరుగా వరుసగా ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీ నుండి వెళ్ళిపోయారు. అయితే తాజాగా పార్టీని వీడిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అంశం వైసీపీలో దుమారం రేపుతోంది. తన ఫోన్ ను ట్రాప్ చేశారంటూ ఆయన సొంత ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సినిమా థియేటర్ల నుంచి నెలకు రూ. 2 లక్షలు వసూలు చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో, ఇదంతా సజ్జల రామకృష్ణారెడ్డి చేయిస్తున్న దుష్ప్రచారమేనని దుయ్యబట్టారు. ఈ నేపథ్యంలో కోటంరెడ్డిపై మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. నెల్లూరు రూరల్ లో 2014లో ఎంతో పోటీ ఉన్నప్పటికీ కోటంరెడ్డికి జగన్ సీటును కేటాయించారని చెప్పారు. పార్టీ మారాలనుకోవడం ఆయన ఇష్టమని.. అయితే వైసీపీపై బురద చల్లడం మంచిది కాదని అన్నారు. కోటంరెడ్డిని చంద్రబాబు ట్రాప్ చేశారని ఆరోపించారు. నిజంగా ట్రాపింగ్ జరిగినట్టయితే.. అవమానం, అనుమానం అనే మాటలు మాట్లాడకుండా విచారణ ముందుకు వెళ్లొచ్చుగా అని ప్రశ్నించారు.

అది ఫోన్ ట్యాపింగ్ కాదు, ఆడియో రికార్డింగ్ అని తెలుసు కాబట్టే కోటంరెడ్డి డ్రామాలు ఆడుతున్నారని కాకాణి ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ టికెట్ ఖరారు చేసుకునే కోటంరెడ్డి వైసీపీపై విమర్శలు గుప్పిస్తున్నారని అన్నారు. ఒకరిద్దరు తమ పార్టీ నుండి వేలిపోవడం వలన తముకు నష్టం లేదని.. వారి స్థానంలో మంచి వారు వస్తారని అన్నారు.

Untitled Document
Advertisements