బాబాయ్ హత్య కేసులో అబ్బాయిని విచారించనున్న సీబీఐ.. సీఎం జగన్ సహా పలువురికి నోటీసులు జారీ

     Written by : smtv Desk | Fri, Feb 03, 2023, 02:42 PM

బాబాయ్ హత్య కేసులో అబ్బాయిని విచారించనున్న సీబీఐ..  సీఎం జగన్ సహా పలువురికి నోటీసులు జారీ

దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ తమ్ముడు మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు ఏళ్లు గడుస్తున్నా నిందుతులు ఎవరు అనే విషయం తేల్చలేదు. అయితే, ఈ కేసులో సీబీఐ దర్యాప్తు మరింత ముమ్మరం చేసింది. ఇటీవలే కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డిని విచారించిన సీబీఐ అతడి నుంచి సమాచారం సేకరించింది. అవినాశ్ ఫోన్ కాల్ డేటా ఆధారంగా సీఎం జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, వైఎస్ భారతి పీఏ నవీన్ లకు నోటీలు జారీ చేయడం తెలిసిందే.
ఈ క్రమంలో కృష్ణమోహన్ రెడ్డి కడప సెంట్రల్ జైలులో సీబీఐ ఎదుట హాజరయ్యారు. ఆయనను సీబీఐ అధికారులు గత మూడు గంటలుగా ప్రశ్నిస్తున్నారు. సీబీఐ నోటీసుల నేపథ్యంలో నవీన్ కూడా కడప చేరుకున్నారు. కృష్ణమోహన్ రెడ్డి విచారణ ముగిసిన అనంతరం నవీన్ ను ఈ మధ్యాహ్నం విచారించనున్నట్టు తెలుస్తోంది.
వివేకా హత్య అనంతరం అవినాశ్ రెడ్డి ఫోన్ నుంచి నవీన్, కృష్ణమోహన్ రెడ్డిలకు అత్యధిక సంఖ్యలో కాల్స్ వెళ్లినట్టు సీబీఐ అధికారులు గుర్తించారు. కృష్ణమోహన్ రెడ్డికి వైఎస్ తో ఎంతో సాన్నిహిత్యం ఉంది. వైఎస్ హయాంలో ఆయన పులివెందుల ఓఎస్డీగా వ్యవహరించారు.

జగన్ సీఎం అయ్యాక కృష్ణమోహన్ రెడ్డి సీఎంవోలో కీలకస్థానంలోకి వచ్చారు. సీఎం జగన్ కు వచ్చే కాల్స్ మొదట కృష్ణమోహన్ రెడ్డి స్వీకరిస్తారని తెలుస్తోంది.

Untitled Document
Advertisements