తారకరత్న ఆరోగ్యం కొరకు బెంగళూరు ఆసుపత్రి వద్ద టీడీపీ నేతల పూజలు

     Written by : smtv Desk | Fri, Feb 03, 2023, 03:43 PM

తారకరత్న ఆరోగ్యం కొరకు బెంగళూరు ఆసుపత్రి వద్ద టీడీపీ నేతల పూజలు

టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ఇటీవల యువగళం పేరుతో చేపట్టిన పాదయాత్రలో పాల్గొన్న నందమూరి తారకరత్న కుప్పంలో యాత్ర మొదలవగానే ఉన్నట్టుండి ఒక్కసారిగా కుప్పకూలిన విషయం తెలిసిందే. వెంటనే తారకరత్నను కుప్పంలోని ఆసుపత్రికి తరలించగా ఆయన గుండెపోటుకు గురైనట్లుగా గుర్తించారు అక్కడి వైద్యులు. దాంతో అక్కడి నుండి తారకరత్నను బెంగుళూరుకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం తారకరత్నకు బెంగళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో, తారకరత్న త్వరగా కోలుకోవాలంటూ టీడీపీ నేతలు నారాయణ హృదయాలయ ఆసుపత్రి వద్ద వినాయక ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
తారకరత్న ఆరోగ్యవంతుడై తిరిగి రావాలంటూ హిందూపురం టీడీపీ నేతలు 101 కొబ్బరికాయలు కొట్టారు. హిందూపురం టీడీపీ పార్లమెంటు స్థానం ప్రధాన కార్యదర్శి అంబికా లక్ష్మీనారాయణ, తదితర నేతలు ఈ పూజల్లో పాల్గొన్నారు.

Untitled Document
Advertisements