లవంగంతో ఇలా చేస్తే ఎక్కిళ్ళు ఆగిపోతాయట!

     Written by : smtv Desk | Fri, Feb 03, 2023, 05:02 PM

లవంగంతో ఇలా చేస్తే ఎక్కిళ్ళు ఆగిపోతాయట!

ఒక్కోసారి మనం ఎన్ని ప్రయత్నాలు చేసిన ఎక్కిళ్ళు ఆగకుండా వస్తూనే ఉంటాయి. ఎక్కిళ్ళు ఒక్కోసారి మరీ తీవ్రంగా వచ్చినప్పుడు అనేక రకాలైన ఇబ్బందులు ఏర్పడతాయి. ఎవరైనా అతిగా ఎక్కిళ్ళు పెడుతున్నారు అంటే ఇంట్లో సహజంగా ఎవరో మిమ్మల్ని తలుచుకున్తున్నారు అనడం మనం వింటూనే ఉంటాము. కానీ నిజానికి ఎక్కిళ్ళు రావడానికి కారణం వాతం చేసే ఆహార పదార్ధాలు గానీ, వేడి చేసే పదార్థాలుగానీ, అతిపుల్లని పదార్థాలుగానీ అరగని ఆహారంగానీ ఎక్కువగా తీసుకోవడం కారణం పచ్చళ్లు, కారాలు మషాలాలు అతిగా తినేవారికి ఎక్కిళ్ళు ఆగకుండా వస్తాయి. రోజుల తరబడి నిలబడి పోతాయి కూడా
* లవంగాన్ని బుగ్గన పెట్టుకొని చప్పరించండి ఎక్కిళ్ళు ఆగుతాయి.
* ఏలకులు లోపలి గింజలు పటికబెల్లం కలిపి నూరి ఓ చెంచా పొడిని పాలలో కలుపుకొని తాగండి లేదా నేరుగా తినేసేయండి ఎక్కిళ్లు తగ్గుతాయి.
* 'అతి మధురం' పొడి "యష్టిచూర్ణం" పేరుతో బజార్లో దొరుకుతుంది! ఈ యష్టిచూర్ణం 1/2చెంచా పొడిలో తేనె కలుపుకొని తింటే ఎక్కిళ్ళు ఆగుతాయి. యష్టి చూర్ణాన్ని అంతకన్నా ఎక్కువగా తింటే వాంతులవుతాయి. ఎక్కిళ్లు అవుతున్నప్పుడు వాంతి అయితే నిజానికి చాలా రిలీఫ్ గా వుంటుంది. చూసుకొని వాడుకోండి.
* పిప్పళ్ళను నేతిలో వేయించి, తగినంత పంచదార వేసి మెత్తగా దంచి 1/2 చెంచా పాడిని నోట్లో వేసుకొని పాలుగానీ, పులవని మజ్జిగగానీ తాగితే ఎక్కిళ్లు ఆగుతాయి.
* పేరు నెయ్యిలో పంచదార వేసుకొని తినడం గోరు వెచ్చటి పాలలో పంచదార వేసుకొని తాగడం.. వీటి వలన కూడా ఎక్కిళ్ళు ఆగుతాయి.
* ఒక్కోసారి ఐస్ వేయకుండా మంచి చెరుకు గడను పిండిన చెరుకు రసం: ఎక్కిళ్ళని తగ్గిస్తుంటుంది |
* వెలగ పండు గుజ్జులో పిప్పళ్ల పొడిని కలుపుకొని తింటే ఎక్కిళ్లు ఆగుతాయి. * పచ్చళ్లు పెట్టుకునే ఉసిరికాయని అమలకి అంటారు. ఈ ఆమలకి కాయలు తాజాగా దొరికితే, దంచి రసంతీసి, ఆ రసంలో పిప్పళ్ళ పొడిని నేతిలో వేయించి కలిపి తాగితే ఎక్కిళ్లు ఆగుతాయి.
ఎండు ఖర్జూరాలు, పిప్పళ్ళు, ఎండు ద్రాక్ష, పంచదార ఈ నాల్గింటినీ సమానంగా తీసుకొని, అన్నింటినీ కలిపి నూరి, 1 చెంచా పొడిలో తేనె కలిపి తీసుకొంటే ఎక్కిళ్లు ఆగుతాయి. ఆయాసం తగ్గిపోతుంది.

Untitled Document
Advertisements