సచివాలయ ప్రమాదం పై స్పందించిన షర్మిల.. మాక్ డ్రిల్ చేశాం అంటూ పచ్చి అబద్ధాలు

     Written by : smtv Desk | Fri, Feb 03, 2023, 05:51 PM

సచివాలయ ప్రమాదం పై స్పందించిన షర్మిల.. మాక్ డ్రిల్ చేశాం అంటూ పచ్చి అబద్ధాలు

తెలంగాణ ముఖ్యమంత్రి మోజుపడి మరీ కట్టిస్తున్న నూతన సచివాలయంలో నేటి ఉదయం వేకువ జామున దట్టమైన పొగలు వెలువడడంతో అగ్నిప్రమాదం సంభవించినట్టు భావిస్తున్నారు. అయితే, నూతన సచివాలయంలో మాక్ డ్రిల్ చేపట్టామని అధికారులు అంటున్నారు. అయితే ఈ విషయం పై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల స్పందించారు. రూ.1,100 కోట్లతో నిర్మించిన సచివాలయంలో సరైన భద్రతా ప్రమాణాలు లేవని బయటపడిందని తెలిపారు. దొరగారు ఏది కట్టినా పైన పటారం లోన లొటారం అంటూ ఎద్దేవా చేశారు.
ఇప్పటికైనా ప్రమాదం ఎందుకు జరిగిందన్నది అన్వేషించాల్సింది పోయి, మాక్ డ్రిల్ చేశాం అంటూ పచ్చి అబద్ధాలు చెబితే నమ్మేవారు ఎవరూ లేరని షర్మిల స్పష్టం చేశారు. ప్రారంభానికి సిద్ధం అవుతున్న సచివాలయంలో అగ్నిప్రమాదంపై దర్యాప్తు చేయించాలని ఆమె డిమాండ్ చేశారు. అఖిలపక్షం నేతల పరిశీలనకు అనుమతి ఇవ్వాలని పేర్కొన్నారు.

Untitled Document
Advertisements