అజీర్తి సమస్యలకు అద్భుత ఔషధం కరివేపాకు!

     Written by : smtv Desk | Fri, Mar 03, 2023, 12:40 PM

 అజీర్తి సమస్యలకు అద్భుత ఔషధం కరివేపాకు!

మన భారతీయ సాంప్రదాయ వంటకాలలో కరివేపాకుది స్థిరమైన స్థానం. వెజిటేరియన్ వంటకాలు మొదలుకుని నాన్వెజ్ వంటలు. టిఫిన్స్, నిలువ ఉండే స్నాక్స్ అన్నింట్లోనూ కరివేపాకు వాడుతారు అనే విషయం మనకు తెలిసిందే. అయితే అన్నింట్లోనూ మన కంటికి కనిపించే కరివేపాకుని మనం మాత్రం తినకుండా తీసి పక్కన పడేయడం అలవాటు. కానీ వీటిని తీసి పక్కన పడేయకుండా తినడం వలన మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలిస్తే మీరు కచ్చితంగా తినడం మొదలు పెడతారు. కరివేపాకు ఆకులు మన జీర్ణక్రియను మెరుగుపరచడమే కాక శరీరంలో పేరుకుపోయిన చెడు కొవ్వును కరిగిస్తాయి. ఇంకా మన కంటికి, గుండెకు కూడా చాలా మంచిదని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. కరివేపాకును కూరలలో తినడం కష్టంగా భావించినవారు దానిని జ్యూస్ రూపంలో కూడా తీసుకోవచ్చట .. అయితే కరిపాకులోని ఆరోగ్యప్రయోజనాలు మరియు జ్యూస్ తయారీ విధానం గురించి తెలుసుకుందాం

కరివేపాకు జ్యూస్ వలన కలిగే ప్రయోజనాలు:
* కరివేపాకు జ్యూస్ రెగ్యూలర్‌గా తీసుకోవడం వల్ల బాడీ డిటాక్స్ అవుతుంది. తద్వారా కడుపులో తిప్పడం, వికారం లాంటివి సమస్యల నుంచి శాశ్వత ఉపశమనం లభిస్తుంది.
* అతి వేగంగా తినేవారికి అజీర్తి సమస్యలు తలెత్తుతాయి. అప్పుడు కరివేపాకు తినడం, కరివేపాకు జ్యూస్ తాగడం చేస్తే అజీర్తి సమస్య దూరం చేస్తుంది. జీర్ణక్రియ సరిగా జరిగి సమయానికి ఆకలి అవుతుంది.
* బరువు తగ్గాలనుకునేవారు కరివేపాకు జ్యూస్ తగ్గడం వల్ల ప్రయోజనం ఉంటుంది. అందుకు తగ్గ శారీరక శ్రమ కూడా చేయాల్సి ఉంటుంది.
* కొవ్వు కరిగించడంలోనూ కరివేపాకు కీలకపాత్ర పోషిస్తుంది. కొవ్వు వలన రక్తం సరఫరా జరగదు. అలాంటప్పుడు కరివేపాకు తింటే, లేదా జ్యూస్ తాగితే మీ ఆరోగ్యానికి మరింత మేలు జరుగుతుంది.
* కరివేపాకు రసాన్ని తీసుకోవడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది.
* ఇంకో ముఖ్యమైన విషయం ఎంటంటే.. కరివేపాకు తినడం, జ్యూస్ తాగడం వలన జుట్టు సంబంధిత సమస్యలు కూడా దూరమవుతాయి.
* కరివేపాకుని మీ డైట్ లో భాగంగా చేసుకోవడం వలన చిన్న వయసులోనే జుట్టు తెల్లబడటం, రాలిపోవడం వంటి సమస్యలు తలెత్తకుండా జుట్టు నల్లగా నిగనిగలాడుతూ ఒత్తుగా పెరుగుతుంది.

అయితే ఈ కరివేపాకు జ్యూస్ ఎలా తాయారు చేసుకోవాలి అంటారా?.. చాలా సింపుల్ అండి కరివేపాకును మిక్సీలో వేసి నీళ్ళు పోసి రుబ్బుకుని అ రసాన్ని తాగేయడమే. మీకు అలా నచ్చలేదు అంటే ఒక గిన్నెలో నీళ్ళు పోసి కరివేపాకులను వేయాలి. గ్యాస్ మీద పెట్టి సన్నని మంట మీద 20 నిమిషాల పాటు మరిగించుకోవాలి. కరివేపాకులు గోధుమ రంగులోకి మారాక నీటిని వడగట్టుకుని తాగేయడమే.





Untitled Document
Advertisements