కోహ్లీ 59 బ్యాటింగ్... 3 వికెట్ల నష్టానికి 289 పరుగులు

     Written by : smtv Desk | Sat, Mar 11, 2023, 05:53 PM

 కోహ్లీ 59 బ్యాటింగ్... 3 వికెట్ల నష్టానికి 289 పరుగులు

అహ్మదాబాద్ టెస్టులో మూడో రోజు ఆట ముగిసింది. టీమిండియా తన తొలి ఇన్నింగ్స్ లో 3 వికెట్ల నష్టానికి 289 పరుగులు చేసింది. ఇవాళ్టి ఆటలో ఓపెనర్ శుభ్ మాన్ గిల్ ఆటే హైలైట్. గిల్ టెస్టుల్లో రెండో సెంచరీ సాధించాడు. 235 బంతులాడిన ఈ యువ ఆటగాడు 128 పరుగులు చేసి లైయన్ బౌలింగ్ లో అవుటయ్యాడు.

కెప్టెన్ రోహిత్ శర్మ 35 పరుగులు చేయగా, ఛటేశ్వర్ పుజారా 42 పరుగులు చేశాడు. ప్రస్తుతం క్రీజులో విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా (16 బ్యాటింగ్) ఉన్నారు. కోహ్లీ అర్ధసెంచరీ సాధించడం విశేషం. 128 బంతులాడిన కోహ్లీ 5 ఫోర్లతో 59 పరుగులు సాధించాడు.

ఆసీస్ తొలి ఇన్నింగ్స్ లో 480 పరుగులు చేయగా... ఆ స్కోరుకు టీమిండియా ఇంకా 191 పరుగులు వెనుకబడి ఉంది. ఆసీస్ బౌలర్లలో కుహ్నెమన్ 1, లైయన్ 1, మర్ఫీ 1 వికెట్ తీశారు.

ఆస్ట్రేలియాపై ఆధిక్యం సంపాదించాలంటే టీమిండియా రేపంతా బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది. ఆటకు మరో రెండ్రోజులు మాత్రమే మిగిలున్న నేపథ్యంలో మ్యాచ్ డ్రా అయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

ఇక, అహ్మదాబాద్ టెస్టు ద్వారా టీమిండియా సారథి రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్లో 17 వేల పరుగుల మార్కు అందుకున్నాడు.





Untitled Document
Advertisements