'దసరా' ట్రైలర్ రిలీజ్!

     Written by : smtv Desk | Tue, Mar 14, 2023, 06:02 PM

'దసరా' ట్రైలర్ రిలీజ్!

నాని హీరోగా 'దసరా' రూపొందింది. సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాకి, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించాడు. సంతోష్ నారాయణ్ సంగీతాన్ని సమకూర్చుతున్న ఈ సినిమాలో నాని జోడీగా కీర్తి సురేశ్ నటించగా, మరో కథానాయికగా దీక్షిత్ శెట్టి అలరించనుంది. మాస్ యాక్షన్ ఎంటర్టయినర్ గా పలకరించనున్న ఈ సినిమాలో, నాని డిఫరెంట్ లుక్ తో కనిపించనున్నాడు.



కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ధరణిగా నాని .. వెన్నెలగా కీర్తి సురేశ్ పాత్రలను పరిచయం చేస్తూ ఈ ట్రైలర్ మొదలవుతుంది. ఒక వైపున ప్రేమ ... మరో వైపున వృత్తిపరమైన ఆధిపత్యం .. అది సహించలేని హీరో తిరుగుబాటుగా ఈ కథ నడుస్తుందని అనిపిస్తోంది.

తమ బతుకుల్లో చీకటి తెరలను కాల్చేయడం కోసం .. తమ ఆనందాలకు అడ్డుపడుతున్న అసురుడిని అంతం చేయడమే హీరో లక్ష్యంగా కనిపిస్తోంది. సముద్రఖని కూడా డిఫరెంట్ లుక్ తో కనిపిస్తున్న ఈ సినిమాను ఈ నెల 30వ తేదీన విడుదల చేయనున్నారు.





Untitled Document
Advertisements