" దసరా " లో కీర్తిని తక్కువ చూపించడానికి కారణం అదే.. నాని

     Written by : smtv Desk | Thu, Mar 16, 2023, 12:14 PM


న్యాచురల్ స్టార్ నానీ తాజా చిత్రం 'దసరా' చిత్రం ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది. సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రానికి, శ్రీకాంత్ ఓదెలడైరెక్షన్ బాధ్యతలు చేపట్టారు. కీర్తి సురేశ్ నాని సరసన హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను, ఈ నెల 30వ తేదీన రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం నానీ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు.

తాజా ఇంటర్వ్యూలో నాని మాట్లాడుతూ .. "మా దర్శకుడు శ్రీకాంత్ బొగ్గు గనుల నేపథ్యం నుంచే వచ్చాడు. అందువల్లనే ఈ సినిమాను అంత సహజంగా తీయగలిగాడు. ఈ సినిమాలో హీరో వైలెంట్ గా కనిపిస్తాడు గానీ .. అతనిలో ఎమోషన్ పాళ్లు ఎక్కువగా ఉంటాయి. ఎక్కడా ఆడియన్స్ ను ఇబ్బంది పెడుతున్నట్టుగా అనిపించదు" అన్నాడు.

"ఈ సినిమాకి సంబంధించి కీర్తి సురేశ్ పాత్రను ఎక్కువగా రివీల్ చేయలేదు. అలా అని చెప్పేసి సస్పెన్స్ లో పెట్టాలనే ఉద్దేశం కూడా కాదు. ఆమె పాత్ర ఈ సినిమాకి హార్టు లాంటిది. అందువలన ముందుగానే ఆమె పాత్రను ఎక్కువగా చూపించే ప్రయత్నం చేయలేదు. ఈ సినిమాలో మొత్తం ఐదు పాటలున్నాయి. ఇంతవరకూ 3 పాటలను రిలీజ్ చేశాము .. మరో పాటను త్వరలో వదలనున్నాము. ఐదో పాటను సినిమాలో చూడవలసిందే .. అదే నా ఫేవరేట్ సాంగ్" అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం నానీ చేసిన ఈ వాఖ్యలు సినిమా మీద మంచి హైప్ క్రియేట్ చేసాయి. ఈ సినిమాలో కీర్తి పాత్ర ఎలా ఉండబోతుంది అంటూ అభిమానులు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.





Untitled Document
Advertisements