కవిత అభ్యర్థనను తిరస్కరణ.. విచారణకు హాజరు కాక తప్పదన్న ఈడీ

     Written by : smtv Desk | Thu, Mar 16, 2023, 12:33 PM

కవిత అభ్యర్థనను తిరస్కరణ.. విచారణకు హాజరు కాక తప్పదన్న ఈడీ

దేశమంతటా ప్రస్తుతం ఎక్కడ చూసినా ఢిల్లీ లిక్కర్ స్కాం కి సంబంధించిన వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ స్కామ్లో అనేక మంది పెద్దల హస్తం ఉన్నట్టుగా ఈడీ అధికారులు అనుమానిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఇందులో భాగంగా అనేక మందిని ఫలు దపాలుగా విచారించారు. ఈ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తాను నేడు విచారణకు హాజరు కాలేనంటూ చేసిన అభ్యర్థనను ఈడీ తిరస్కరించింది. విచారణకు కచ్చితంగా హాజరు కావాలని అధికారులు తేల్చి చెప్పడంతో కవిత ఈడీ కార్యాలయానికి బయలుదేరనున్నట్టు తెలుస్తోంది.

అంతకుమునుపు.. ఆనారోగ్య కారణాలతో విచారణకు హాజరు కాలేకపోతున్నానంటూ కవిత తన న్యాయవాది సోమా భరత్‌ కుమార్‌తో ఈడీకి సమాచారం పంపించారు. విచారణకు మరో రోజును నిర్ణయించాలని అభ్యర్థించారు. మరి కాసేపట్లో కవిత విచారణకు హాజరువుతారని అంతా అనుకుంటుండగా ఆమె తరపు న్యాయవాది సోమా భరత్ ఈడీ కార్యాలయంలో ప్రత్యక్షమవడం సంచలనం కలిగించింది. ఈడీ ఏ నిర్ణయం తీసుకుంటుందో అన్న ఉత్కంఠ పెరిగింది. అయితే.. ఎమ్మెల్సీ కవిత అభ్యర్థనను ఈడీ అధికారులు తిరస్కరించినట్టు సమాచారం.

ఈ కేసులో కీలక నిందితులుగా ఉన్న ఢిల్లీ నేత మనీశ్ సిసోడియా, పిళ్లై, బుచ్చిబాబుల కస్టడీ ఒకటి రెండు రోజుల్లో ముగియనుంది. ఈ నేపథ్యంలో కవిత సహా నిందితులందరినీ ఎదురెదురుగా కూర్చోబెట్టి విచారించాలని ఈడీ తలచినట్టు చెబుతున్నారు. అయితే.. వీరి కస్టడీ ముగిశాకే విచారణకు హాజరుకావాలని కవిత భావించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో కవిత అభ్యర్థనను ఈడీ తిరస్కరించడం తీవ్ర ఉత్కంఠ రేపుతోంది.

Kavi





Untitled Document
Advertisements