ఎమ్మెల్సీ కవిత అభ్యర్థనను తిరస్కరించిన సుప్రీంకోర్టు

     Written by : smtv Desk | Fri, Mar 17, 2023, 12:42 PM

ఎమ్మెల్సీ కవిత అభ్యర్థనను తిరస్కరించిన సుప్రీంకోర్టు

ప్రస్తుతం ఎక్కడ తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు కవిత పేరు మారుమ్రోగి పోతున్న విషయం తెలిసిందే. ధిల్లీ లిక్కర్ స్కాం లో ఆరోపణలు ఎదుర్కుంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఈడీ విచారణకు సంబంధించి తాను దాఖలు చేసిన పిటిషన్ ను త్వరగా విచారించాలన్న కవిత అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈనెల 24నే విచారణ జరుపుతామని స్పష్టంచేసింది.

ఈనెల 11న ఈడీ విచారణకు కవిత హాజరైన విషయం తెలిసిందే. అయితే గురువారం జరగాల్సిన రెండో విడత విచారణకు ఆమె హాజరుకాలేదు. ‘‘విచారణ విషయంలో మహిళలకు సీఆర్ పీసీ 160 ద్వారా మినహాయింపులు ఉన్నాయి. దీనిపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాను. ఈనెల 24న విచారణ జరగనుంది. తీర్పు తర్వాతే ఏ నిర్ణయమైనా తీసుకుంటాం’’ అని ఈడీకి సమాచారమిస్తూ కవిత లేఖ రాశారు.

అయితే కవిత లేఖను ఈడీ అధికారులు తిరస్కరించారు. ఈ నెల 20న విచారణకు వ్యక్తిగతంగా హాజరుకావాలంటూ మరోసారి నోటీసులు జారీ చేశారు. ఈనేపథ్యంలో తన పిటిషన్ ను త్వరగా విచారించాలని సుప్రీంకోర్టును కవిత అభ్యర్థించారు. కానీ అత్యున్నత ధర్మాసనం అందుకు నిరాకరించింది.





Untitled Document
Advertisements