ఈ మధ్య నా బ్యానర్ సినిమాలు ఎందుకు ఫెయిల్ అవుతున్నాయో అర్థం కాలేదు.. మోహన్ బాబు

     Written by : smtv Desk | Mon, Mar 20, 2023, 12:28 PM

ఈ మధ్య  నా బ్యానర్ సినిమాలు ఎందుకు ఫెయిల్ అవుతున్నాయో అర్థం కాలేదు.. మోహన్ బాబు

సీనియర్ హీరో మోహన్ బాబు ఈయన నిన్నటి తరం నాయకుడు. తనదైన శైలిలో నటించి ప్రేక్షకుల అభిమానాన్ని చురోగొన్న వ్యక్తి. కథానాయకుడిగా, ప్రతి నాయకుడిగా తన అద్భుతమైన నటన ప్రతిభతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న ఆయనను ప్రేక్షకులు ముద్దుగా కలెక్షన్ కింగ్ అని పిలుచుకుంటారు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ తన కెరియర్ గురించిన అనేక విషయాలను ఆయన ప్రస్తావించారు. "కెరియర్ పరంగా చూసుకుంటే నాకు ఎవరూ ఎలాంటి సాయం చేయలేదు. కష్టం వచ్చినప్పుడు .. నష్టం వచ్చినప్పుడు ప్రకృతి మాత్రమే నాకు సాయం చేసింది" అని అన్నారు.

" సినిమాలు చేసే నేను సంపాదించాను .. కొన్ని సినిమాలు తీయడం వలన వచ్చిన నష్టాల కారణంగా మంచి మంచి ఆస్తులు అమ్ముకున్నాను. మళ్లీ సంపాదించగలుగుతాను అనే ధైర్యంతో ముందుకు వెళ్లాను .. అనుకున్నది సాధించగలిగాను. నా సీనియర్ హీరోలు సొంత బ్యానర్లు పెట్టడం చూసి నేను కూడా సొంత బ్యానర్ ను స్థాపించాను. ఈ విషయంలో ఏ హీరోను నేను స్ఫూర్తిగా తీసుకోలేదు. నేను సొంత బ్యానర్ పెట్టడం దాసరి గారికి ఇష్టం ఉండేది కాదు .. వీడు ఎక్కడ డబ్బులు పోగొట్టుకుంటాడో అనే ఒక భయం ఆయనకి ఉండేది" అని చెప్పారు.

"అప్పట్లో నా సొంత బ్యానర్లో ఏ సినిమా తీసినా సూపర్ హిట్. ఈ మధ్య కాలంలో మాత్రం ఫ్లాపులు వస్తున్నాయి. ఎక్కడో .. ఏదో తప్పు జరుగుతోంది. ఈ విషయంలో ప్రేక్షకులను తప్పుపట్టడానికి లేదు. 'సన్నాఫ్ ఇండియా' సినిమా ఒక ప్రయోగం అని ముందే చెప్పాను. అందువలన ఆ సినిమా పోయినా నాకు పెద్ద బాధగా అనిపించలేదు. కానీ 'జిన్నా' ఎందుకు ఫెయిల్ అయిందనేది అర్థం కాలేదు" అంటూ తన మనసులోని మాటను బైటపెట్టారు.





Untitled Document
Advertisements