నాకు సినిమానే లైఫ్, ప్రేక్షకులే నా జీవితం.. మంచు మనోజ్

     Written by : smtv Desk | Mon, Mar 27, 2023, 01:07 PM

నాకు సినిమానే లైఫ్, ప్రేక్షకులే నా జీవితం.. మంచు మనోజ్

దివంగత నటుడు శ్రీహరి పేరు చెప్పగానే మనకు గుర్తొచ్చే పాత్ర మగదీరలో ఆయన నటించిన షేర్ ఖాన్ పాత్ర. రియల్ స్టార్ గా పేరు తెచ్చుకున్న శ్రీహరి విలన్ పాత్రలే కాకుండా హీరోగా కూడా బద్రాచలం వంటి హిట్ సినిమాలలో సైతం నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆయన నట వారసుడు మేఘాన్ష్ సైతం ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతున్నారు. అయితే శ్రీహరి కొడుకు మేఘాన్ష్ కొత్త సినిమా ప్రారంభోత్సవంలో మంచు మనోజ్ సందడి చేశారు. ఈ సందర్భంగా తన బుజ్జి తమ్ముడి సినిమా హిట్ కావాలని కోరుకుంటున్నానని మనోజ్ చెప్పారు. ‘వాట్ ద ఫిష్’ అనే చిత్రంతోపాటు త్వరలోనే తాను ఓ సినిమా స్టార్ట్ చేస్తున్నట్లు వెల్లడించారు.

‘‘కొత్త జీవితాన్ని ప్రారంభించాను. మీ అందరి ఆశీర్వాదాలు కావాలి. మాకొక సంతోషకరమైన జీవితాన్నిఇస్తారని ఆ దేవుడిని కోరుకుంటున్నాను’’ అని చెప్పారు. ‘‘నాకు సినిమానే లైఫ్. మీరే (ప్రేక్షకులే) నా జీవితం. సినిమా లేకపోతే నాకేమీ లేదు. మళ్లీ సినిమాకే వస్తున్నాను’’ అని చెప్పుకొచ్చారు. అయితే మంచు విష్ణుకు, తనకు మధ్య జరిగిన వివాదంపై మాత్రం స్పందించలేదు. ప్రస్తుతం అన్నదమ్ములను కలిపే ప్రయత్నాలు జరుగుతున్నాయని, అందుకే విష్ణు గురించి మనోజ్ మాట్లాడలేదని తెలుస్తోంది.

మంచు ఫ్యామిలీలో అన్నదమ్ముల మధ్య గొడవలు ఇటీవల బయటపడిన విషయ తెలిసిందే. అన్న విష్ణు తీరుపై మనోజ్ ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. తండ్రి మోహన్ బాబు ఆగ్రహం వ్యక్తం చేయడంతో మనోజ్ ఆ వీడియోను డిలీట్ చేశారు. వివాదంపై స్పందించిన విష్ణు.. తమ మధ్య ఉన్నది పెద్ద గొడవ కాదని, మనోజ్ తన తమ్ముడని, తామిద్దరి మధ్య గొడవలు సాధారణమైన విషయమని చెప్పుకొచ్చారు.





Untitled Document
Advertisements