నేనెప్పుడు ధోనికి వీరాభిమానినే అంటున్న హార్థిక్ పాండ్యా..

     Written by : smtv Desk | Tue, May 23, 2023, 01:14 PM

క్రీడాకారులకు అభిమానులు ఉండడం సహజమే. అయితే ఆ అభిమాను క్రీడలను అభిమానించేవారే తప్ప వారు ఆటగాళ్ళు కాదు. కానీ ఒక ఆటగాన్ని తోటి ఆటగాళ్ళు కూడా అభిమానించడం అనేది కెప్టెన్ కూల్ గా పేరు తెచ్చుకున్న ఆయనకు మాత్రమే సొంతం మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అంటే, టీమిండియా క్రికెటర్ రాహుల్ పాండ్యాకు ఎంతో అభిమానం. పలు సందర్భాల్లో తన ప్రకటనల ద్వారా ధోనీ అటే తనకు ఎంత గౌరవం, అభిమానం అన్నది పాండ్యా వ్యక్తం చేశాడు. ధోనీని పాండ్యా ఆదర్శంగా తీసుకుంటాడు. ఈ క్రమంలో మరోసారి ధోనీ విషయంలో తన అభిప్రాయాలను ఓ వీడియో రూపంలో పంచుకున్నాడు. ఈ వీడియోని గుజరాత్ టైటాన్స్ ట్విట్టర్ హ్యాండిల్ షేర్ చేసింది.

తాను ఎప్పుడూ ఎంఎస్ ధోనీ అభిమానినేనని పాండ్యా స్పష్టం చేశాడు. కేవలం దెయ్యం మాత్రమే ఆ గొప్ప వ్యక్తిని ద్వేషించగలదన్నాడు. పాండ్యా, ధోనీ మధ్య మంచి అనుబంధమే ఉంది. టీమిండియా కోసం వీరు కలసి ఎంతో కాలం ఆడారు. ఇప్పుడు వీరిద్దరూ చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా ముఖాముఖి పోరాడనున్నారు. ఒకరు గుజరాత్ కెప్టెన్ గా, మరొకరు సీఎస్కే కెప్టెన్ గా తమ ఫ్రాంచైజీ విజయాల కోసం కృషి చేయనున్నారు.

‘‘చాలా మంది మహీని సీరియస్ అని అనుకుంటారు. కానీ, నేను సరదాగా ఉంటాను. మహేంద్ర సింగ్ ధోనీగా నేను చూడను. అతడి నుంచి నేను ఎన్నో నేర్చుకున్నాను. అతడ్ని గమనించడం ద్వారానే ఎన్నో సానుకూలతలు అలవరచుకున్నాను. నా వరకు అతడు మంచి స్నేహితుడు, ప్రియమైన సోదరుడు. అతడితో నేను చిలిపిగా ఉంటాను’’ అని పాండ్యా వీడియోలో తెలిపాడు.


Untitled Document
Advertisements