మెగా అభిమానులకు సర్ ప్రైజ్

     Written by : smtv Desk | Mon, May 29, 2023, 12:03 PM

 మెగా అభిమానులకు సర్ ప్రైజ్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న చిత్రం ‘బ్రో’. సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నారు. హైదరాబాద్లో శరవేరంగా చిత్రీకరణ జరుగుతోంది. తమిళంలో సూపర్ హిట్ అయిన ‘వినోదయ సితం’కు ఇది రీమేక్‌. ఈ చిత్ర బృందం నుంచి మెగా అభిమానులకు సర్ ప్రైజ్ వచ్చింది. సినిమాలో మామా అల్లుళ్లు పవన్, సాయి తేజ్ కలిసి ఉన్న పోస్టర్‌ను రిలీజ్‌ చేసింది. బైక్‌పై కాలుపెట్టిన పవన్‌ స్టయిల్ లుక్ ఇవ్వగా.. వెనకాల సాయితేజ్ చేతులు కట్టుకొని నిల్చున్నాడు. ఇద్దరూ క్లాస్ లుక్ లో కనిపిస్తున్నారు.

ఈ సినిమాలో పవన్‌ దేవుడి పాత్ర పోషించగా, సాయి తేజ్‌ మార్క్‌ అనే యువకుడి పాత్రలో నటిస్తున్నాడు. తెలుగు నేటివిటీకి తగ్గట్టు మూల కథలో త్రివిక్రమ్ పలు మార్పులు చేసిన ఈ చిత్రానికి థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. జులై 28న విడుదల కానుంది. మరోవైపు విరూపాక్షతో సాయితేజ్ తన కెరీర్ లో బ్లాక్ బస్టర్ విజయం అందుకోగా.. పవన్‌ ‘బ్రో’తో పాటు నాలుగు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.

Untitled Document
Advertisements