నిమ్మరసంతో కొలెస్ట్రాల్ కి చెక్..

     Written by : smtv Desk | Mon, May 29, 2023, 02:35 PM

నిమ్మరసంతో కొలెస్ట్రాల్ కి చెక్..

మనం రోజు తీసుకునే ఆహారంలో నిమ్మకాయని కూడా చేర్చుకుంటే మనకు బోలెడు ఆరోగ్యప్రయోజనాలు చేకురతాయి అనే విషయం మనకు తెలిసినప్పటికీ మనం అశ్రద్ధ చేస్తూనే ఉంటాము. మరి ఈ నిమ్మలో ఉండే ఆరోగ్యప్రయోజనాల గురించి తెలుసుకుందాం.
* నిమ్మకాయతో పచ్చడి పెడతారు. విటమిన్ సి నిమ్మకాయ రసంలో బాగా ఉంటుంది.
* కొంతమంది ముఖము కడుగగానే ఒక నిమ్మకాయ రసం, తేనె నీటితో కలిపి తాగడం వలన ఆరోగ్యాన్ని ఎంతో కాపాడుతుంది.
* బట్టలు పిండే నీటిలో నిమ్మరసం కలుపుతారు.
* ఇంటిని శుభ్రం చేసే నీటిలో నిమ్మ రసం కలుపుతారు.
* వేసవిలో నిమ్మరసం ఎక్కువగా తాగుతారు.
* నిమ్మ రసం తులసి ఆకులతో కలిపి దంచి రాసుకుంటే ఎలాంటి చర్మ వ్యాధి అయినా తగ్గిపోతుంది.
* విటమిన్ సి లేకుండా ఐరన్ ను శరీరం తీసుకోదు. ఐరన్ శరీరం వాడుకొనకపోతే రక్తలేమి ఏర్పడుతుంది, కాబట్టి నిమ్మరసం తాగడం చాలా మంచిది.
* నిమ్మ రసం తలకు రుద్ది అరగంట తర్వాత స్నానం చేస్తే తల నిగనిగలాడుతుంది.
* నిమ్మ పుల్లగా ఉన్నప్పటికీ జీర్ణమైన తరువాత క్షారగుణం సంతరించుకొని ఆరోగ్యపరంగా చాలా ప్రయోజనం కలుగజేస్తుంది.
* నిమ్మలోని పులుపు గుణాలు జీర్ణరసాల ఉత్పత్తికి తోడ్పడతాయి. దీనితో జీర్ణక్రియ బాగా జరుగుతుంది. ఫలితంగా ఆహారంలోని పోషకాలను బాగా గ్రహిస్తుంది.
* నిమ్మరసం మూత్రపిండాలలో రాళ్లు రాకుండా కాపాడుతుంది.
* నిమ్మ లో ఎలర్జీలను కాపాడే గుణం ఉంది. క్యాన్సర్, నాడీ జబ్బుల నుండి కాపాడుతుంది.
* నిమ్మరసం మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతుంది. రక్త నాళాలలో పూడికలు రాకుండా కాపాడుతుంది.
* నిమ్మరసంలో విటమిన్ సి, విటమిన్ ఎ,కాల్షియం, మెగ్నీషియం ఉన్నాయి.





Untitled Document
Advertisements